Breed Development |రూ. 50 లక్షల సబ్సిడీ ఇచ్చే బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌!-how to get 50 lakhs subsidy under breed development scheme ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Breed Development |రూ. 50 లక్షల సబ్సిడీ ఇచ్చే బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌!

Breed Development |రూ. 50 లక్షల సబ్సిడీ ఇచ్చే బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌!

Praveen Kumar Lenkala HT Telugu
Jan 24, 2022 03:17 PM IST

Breed Development.. నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఫర్‌ బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ షీప్‌ అండ్‌ గోట్‌ సెక్టార్‌ పథకం ద్వారా రూ. 50 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది.

<p>గొర్రెల పెంపకం (ప్రతీకాత్మక చిత్రం)</p>
గొర్రెల పెంపకం (ప్రతీకాత్మక చిత్రం) (unsplash)

మేకలు, గొర్రెల బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌ చేయాలనునే ఔత్సాహికులకు రూ. 50 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఫర్‌ బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ షీప్‌ అండ్‌ గోట్‌ సెక్టార్‌ పథకం ద్వారా రూ. 50 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. 

ఈ పథకం ప్రయోజనాలేంటి? ఎవరు అమలు చేస్తారు? దరఖాస్తులు ఎలా చేయాలి? వంటి విషయాలు తెలుసుకుందాం రండి..

నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లో భాగంగా గొర్రెలు, మేకలు తదితర పశు సంపద అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. 

బ్రీడ్‌ అభివృద్ధి ద్వారా ఆయా జంతువుల ఉత్పాదకత పెంచడం కూడా ఈ లక్ష్యంలో భాగం.

ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఫర్‌ బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ షీప్‌ అండ్‌ గోట్‌ సెక్టార్

నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లో భాగంగా పశువులు, పౌల్ట్రీ బ్రీడ్‌ అభివృద్ధిపై ఉప మిషన్‌ అమలవుతోంది. కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల బ్రీడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లక్ష్యంగా పనిచేసే ఈ సబ్‌ మిషన్‌లో భాగమే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఫర్‌ బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ షీప్‌ అండ్‌ గోట్‌ సెక్టార్‌ పథకం.

ఎలా అమలవుతుంది?

రాష్ట్ర పశుసంవర్థక శాఖ ద్వారా ఏర్పాటైన సంస్థ ఈ పథకం అమలు సంస్థగా ఉంటుంది. ఆ ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీ వ్యక్తులు, సంస్థలు, ఎంట్రప్రెన్యూర్స్‌ నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతుంది.

ఆయా దరఖాస్తులను పరిశీలించి షెడ్యూల్డ్‌ బ్యాంకులు, లేదా నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌సీడీసీ) వంటి ఆర్థిక సంస్థల ద్వారా ఆర్థిక, రుణసాయం పొందేందుకు స్టేట్‌ ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీ సిఫారసు చేస్తుంది.

ప్రాజెక్ట్‌ ఫండింగ్‌ కోసం సదరు ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్‌ లేదా బ్యాంక్‌ నుంచి హామీ లభిస్తే ఆయా దరఖాస్తులను స్టేట్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అప్రూవల్‌ కోసం పంపుతారు. అక్కడ ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు.

ఎవరు అర్హులు?

వ్యక్తులు, రైతు సంఘాలు, స్వయం సహాయ సంఘాలు, సెక్షన్‌ 8 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పథకం ద్వారా కేంద్రం రాయితీ అందిస్తుంది.

సంబంధిత రంగంలో శిక్షణ పొంది ఉండాలి. లేదా తగిన అనుభవం ఉండాలి. అలాగే బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌ నుంచి లోన్‌ మంజూరై ఉండాలి. లేదా బ్యాంకు గ్యారంటీ లభించి ఉండాలి.

సదరు వ్యక్తులు లేదా సంస్థలకు సొంతంగా లేదా లీజు ప్రాతిపదికన స్థలం తీసుకుని ఉండాలి. కేవైసీ సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలి.

ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఫర్‌ బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ షీప్‌ అండ్‌ గోట్‌ సెక్టార్‌ ప్రయోజనాలు

ఈ పథకం ద్వారా 50 శాతం సబ్సిడీ అంటే గరిష్టంగా యూనిట్‌కు రూ. 50 లక్షలు సబ్సిడీ లభిస్తుంది.

మేకలు, గొర్రెల బ్రీడింగ్‌ యూనిట్‌లో కనీసం 500 ఆడ, 25 మగవి ఉండాలి. మార్గదర్శకాలకు లోబడి హైజెనెటిక్‌ రకాలను ఎంచుకోవాలి. అధిక మేక పాలను ఉత్పత్తి చేసేవి, నాణ్యమైన మాంసం, ఉన్ని అందించే రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

రూ. 50 లక్షల సబ్సిడీని రెండు విడుతలుగా కేంద్రం సిడ్బీ ద్వారా బ్యాంకు ఖాతాకు జమచేస్తుంది. మిగిలిన 50 శాతం మొత్తాన్ని రుణంగా తీసుకోవాలి లేదా సొంతంగా పెట్టుబడి పెట్టాలి.

 

Whats_app_banner

సంబంధిత కథనం