Atiq Ahmed: చనిపోయే ముందు అతీక్ అహ్మద్, అష్రఫ్ చివరగా చెప్పిన 'గుడ్డూ ముస్లిం' ఎవరు?-who is guddu muslim whose name was last thing atiq ahmed ashraf ahmed uttered know the details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Atiq Ahmed: చనిపోయే ముందు అతీక్ అహ్మద్, అష్రఫ్ చివరగా చెప్పిన 'గుడ్డూ ముస్లిం' ఎవరు?

Atiq Ahmed: చనిపోయే ముందు అతీక్ అహ్మద్, అష్రఫ్ చివరగా చెప్పిన 'గుడ్డూ ముస్లిం' ఎవరు?

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 16, 2023 05:48 PM IST

Atiq Ahmed: హత్యకు గురయ్యే క్షణాల ముందు అతీక్, అష్రఫ్ అహ్మద్.. గుడ్డూ ముస్లిం అనే పేరు చెప్పారు. ఈ గుడ్డూ ముస్లిం ఎవరో ఇక్కడ తెలుసుకోండి.

లాయర్ ఉమేశ్ పాల్‍పై బాంబు వేసిన గుడ్డూ ముస్లిం ఫొటో ఇది (Photo: HT Photo)
లాయర్ ఉమేశ్ పాల్‍పై బాంబు వేసిన గుడ్డూ ముస్లిం ఫొటో ఇది (Photo: HT Photo)

Atiq Ahmed: గ్యాంగ్‍స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన అతీక్ అహ్మద్ (Atiq Ahmed), ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్‍(Ashraf Ahmed) ను ముగ్గురు షూటర్లు ఉత్తర ప్రదేశ్‍లోని ప్రయాగ్‍రాజ్‍లో హత్య చేశారు. పోలీసులు, మీడియా ముందే అతీక్, అష్రాఫ్ సోదరులపై శనివారం రాత్రి కాల్పులు జరిపి చంపేశారు. అయితే, హత్యకు గురయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమైన విషయం గుడ్డూ ముస్లిం” అని అష్రాఫ్ అహ్మద్ చెప్పాడు. ఆ మాటలు పూర్తి కాకముందే ఆ ఇద్దరు సోదరులపై కాల్పులు జరిగాయి. ముందుగా అతీక్‍ను కాల్చిన షూటర్లు.. ఆ తర్వాత ఆష్రాఫ్‍పై కాల్పులు జరిపారు. అయితే, అష్రాఫ్ చెప్పిన ఆ గుడ్డూ ముస్లిం ఎవరంటే..

అతడు కూడా మోస్ట్ వాంటెడ్

Guddu Muslim: అతీక్, అతడి సోదరుడు అష్రాఫ్, కుమారుడు అసద్‍తో పాటు లాయర్ ఉమేష్ పాల్ హత్య కేసులో గుడ్డూ ముస్లిం కూడా నిందితుడిగా ఉన్నాడు. ఉత్తర ప్రదేశ్‍లో మోస్ట్ వాంటెండ్ హంతకుడిగా గుడ్డూ ముస్లిం ఉన్నాడు. అతీక్ అహ్మద్ బావ అక్లా అహ్మద్ వద్ద బాంబ్ మేకర్‌గా పేరున్న గుడ్డూ ముస్లిం ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నాడని తెలుస్తోంది.

బాంబుల తయారీ

Guddu Muslim: బాంబుల తయారీదారుడిగా గుడ్డూ ముస్లిం ఉన్నాడు. క్రూడ్ బాంబులను అతడు తయారు చేస్తుంటాడు. అందుకే అతడిని గుడ్డూ బాంబాజ్‍గానూ పిలుస్తారు. ప్రయాగ్‍రాజ్‍ (అలహాబాద్)లో గుడ్డూకు చాలా నేర చరిత్ర ఉంది.

ఉమేశ్ పాల్‍పై బైక్‍పై నుంచి బాంబు విసిరిన వ్యక్తి కూడా గుడ్డూ ముస్లిమేనని అభియోగాలు నమోదయ్యాయి.

Guddu Muslim: అలహాబాద్‍లో పుట్టిన గుడ్డూ ముస్లిం ఆ తర్వాత లక్నోకు వెళ్లాడు. తక్కువ వయసులోనే నేర ప్రపంచంలో అడుగుపెట్టాడు. లక్నోలో జరిగిన చాలా భారీ నేరాల్లో పాల్గొన్నాడు. ఓ టీచర్‌ను చంపిన హత్య కేసులో 1997లోనే అరెస్ట్ అయిన గుడ్డూ ముస్లిం.. ఆ తర్వాత ఆధారాలు లభించక విడుదలయ్యాడు.

ఎమ్మెల్యే అజిత్ సింగ్‍కు గుడ్డూ ముస్లిం.. సన్నిహితంగా ఉంటాడని వాదనలు వచ్చాయి. చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న గుడ్డూ ముస్లిం ఇప్పటికే పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు.

Guddu Muslim: బిహార్‌కు పారిపోయిన గుడ్డూ ముస్లింను 2001లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత అతడు మళ్లీ బయటికి వచ్చాడు. అయితే, అప్పట్లో గుడ్డూ బయటికి వచ్చేందుకు అతీక్ సహకరించాడని వాదన ఉంది. ఆ తర్వాత అతీక్, గుడ్డూ ముస్లింకు సాన్నిహిత్యం ఏర్పడిందని తెలుస్తోంది.

ఉమేశ్ పాల్ హత్యతో గుడ్డూ ముస్లిం పేరు మరోసారి ఎక్కువగా వినిపిస్తోంది. అతడిపై రూ.5లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు.

గుడ్డూ ముస్లిం అరెస్టు?

Guddu Muslim: గుడ్డూ ముస్లింను మహారాష్ట్రలోని నాసిక్‍లో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్టు కొన్ని రిపోర్టులు బయటికి వచ్చాయి. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం