Atiq Ahmad shot dead : గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​​ దారుణ హత్య.. యూపీలో హైఅలర్ట్​!-gangsterturnedpolitician atiq ahmad brother shot dead in up s prayagraj 3 held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Atiq Ahmad Shot Dead : గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​​ దారుణ హత్య.. యూపీలో హైఅలర్ట్​!

Atiq Ahmad shot dead : గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​​ దారుణ హత్య.. యూపీలో హైఅలర్ట్​!

Sharath Chitturi HT Telugu
Apr 16, 2023 07:01 AM IST

Atiq Ahmad shot dead : గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​, అతడి సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం వారిని పోలీసులు తీసుకెళుతుండగా.. దుండగులు వారిపై కాల్పులు జరిపి చంపేశారు!

అతీక్​ అహ్మద్​, అతడి సోదరుడిని కాల్చి చంపిన ప్రదేశం
అతీక్​ అహ్మద్​, అతడి సోదరుడిని కాల్చి చంపిన ప్రదేశం (AP)

Atiq Ahmad shot dead : ఉత్తర్​ ప్రదేశ్​లో పెను సంచలనం! 100కుపైగా క్రిమినల్​ కేసులు ఉండి, పోలీసుల ఎన్​కౌంటర్​లో ఇటీవలే కొడుకుని కోల్పోయిన గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రయాగ్​రాజ్​లో.. వైద్య పరీక్షల కోసం పోలీసులు అతీక్​తో పాటు అతని సోదరుడు అష్రఫ్​ను తరలిస్తుండగా.. దుండగులు పాయింట్​ బ్లాంక్​ రేంజ్​లో కాల్పులు జరిపి ఇద్దరిని చంపేశారు.

జర్నలిస్టుల వేషంలో..!

శుక్రవారం రాత్రి.. అతీక్​ అహ్మద్​, అతడి సోదరులను ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. కొందరు జర్నలిస్టులు వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అతీక్​ అహ్మద్​ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. జర్నలిస్టు ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి తుపాకీతో తొలుత గ్యాంగ్​స్టర్​పై దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత అతడి సోదరుడిని టార్గెట్​ చేశాడు. మరో ఇద్దరు తుపాకీలతో పలుమార్లు తూటాలను వారి శరీరాల్లోకి దింపారు. ఈ దృశ్యాలు మీడియా కెమెరాల్లో చిక్కాయి. పోలీసులు వారిని పట్టుకునే లోపే.. ఇదంతా జరిగిపోయింది.

Atiq Ahmed dead : అతీక్​ అహ్మద్​ హత్య నేపథ్యంలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్​ గాయపడ్డారు.

ఉత్తర్​ ప్రదేశ్​లో హై- అలర్ట్​..!

అతీక్​ అహ్మద్​ హత్య నేపథ్యంలో ఉత్తర్​ ప్రదేశ్​ ఉలిక్కిపడింది. అధికారులు రాష్ట్రం అంతా హై-అలర్ట్​ జారీ చేశారు. ముఖ్యంగా ఘటన జరిగిన ప్రయాగ్​రాజ్​లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​.. అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పూర్తి వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

100కుపైగా కేసుల్లో నిందితుడు..!

Atiq Ahmad latest news : కిడ్నాప్​, మర్డర్​తో పాటు అతీక్​ అహ్మద్​పై 100కుపైగా కేసులు ఉన్నాయి. అతీక్​ అహ్మద్​ ఓ మాజీ రాజకీయ నేత కూడా. సోదరుడితో పాటు అతీక్​ అహ్మద్​.. గుజరాత్​ సబర్మతి సెంట్రల్​ జైలులో హై- సెక్యూరిటీ మధ్య జీవించేవాడు. కాగా.. 2006 ఉమేశ్​ పాల్​ కిడ్నాప్​ కేసులో వారిని కోర్టులో హాజరుపరిచేందుకు.. ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు గుజరాత్​ నుంచి గత నెల 26న ప్రయాగ్​రాజ్​కు తీసుకొచ్చారు.

Atiq Ahmed death latest news : మార్చ్​ 28న.. అహ్మద్​తో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. తీర్పుపై స్పందించిన అహ్మద్​.. తను అమాయకుడినని, తనని- తన కుటుంబాన్ని తప్పుగా ఇరికిస్తున్నారని ఆరోపించాడు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాడు. ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు ఫేక్​ ఎన్​కౌంటర్​లో తనను చంపే ప్రమాదం ఉందని, తన ప్రాణాలు ఆపద ఉందని పేర్కొన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం