Turkey Earthquake: విద్యార్థి ప్రాణాలు కాపాడిన వాట్సాప్: భూకంప విలయంలో మరింత పెరిగిన మృతుల సంఖ్య
Turkey Earthquake: శిథిలాల కింద చిక్కుకున్న ఓ యువకుడు.. ప్రాణాలను కాపాడుకునేందుకు వాట్సాప్ సహకరించింది. పూర్తి వివరాలు ఇవే.
Turkey Earthquake: సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‍లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ అతిగా వినియోగిస్తే దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే, సంక్షోభ సమయాల్లో ఇవి చాలా యూజ్ అవుతాయి. ఒక్కోసారి ప్రాణాలను కాపాడుకునేందుకు కూడా సహకరిస్తాయి. ఇలాంటి ఘటన టర్కీ భూకంపం (Turkey Earthquake) తర్వాత జరిగింది. ఓ భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఓ విద్యార్థి.. వాట్సాప్ (WhatsApp వల్ల ప్రాణాలను కాపాడుకోగలిగాడు. ఈశాన్య టర్కీలో ఓ భవనం శిథిలాల కింద చిక్కుకున్నబోరాన్ కుబాట్ (Boran Kubat) అనే యువకుడు వాట్సాప్ వీడియో ద్వారా సమాచారాన్ని వెల్లడించాడు. లొకేషన్‍ను షేర్ చేశాడు. పూర్తి వివరాలు ఇవే.
Turkey Earthquake: సోమవారం రోజున తొలిసారి భూకంపం వచ్చినప్పుడు బోరాన్‍తో పాటు అతడి తల్లి కూడా సురక్షితంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత వాళ్లు ఇంట్లోకి వెళ్లాక మళ్లీ భూమి కంపించింది. దీంతో భవనం కూలిపోయింది. దీంతో వారు శిథిలాల మధ్య చిక్కుకున్నారు.
వాట్సాప్ కాపాడిందిలా..
Turkey Earthquake: భవనం కుప్పకూలటంతో శిథిలాల కింద చిక్కుకున్న బోరాన్ కుబాట్ గాయపడ్డాడు. అయితే ఆ సమయంలో అతడి వద్ద మొబైల్ ఉంది. దీంతో వాట్సాప్‍లో వీడియో రికార్డు చేసి స్టేటస్‍గా పెట్టాడు. అతడి అడ్రస్‍తో పాటు లొకేషన్‍ను దానికి జత చేశాడు. “ఈ వాట్సాప్ స్టేటస్ చూసిన వారు..దయచేసి రండి, సాయం చేయండి” అని అతడు కోరాడు. ఈ వీడియో వైరల్ కావటంతో సహాయక సిబ్బంది ఆ ప్రాంతాన్ని గుర్తించారు. బోరాన్‍తో పాటు అమె తల్లిని కూడా సురక్షితంగా శిథిలాల నుంచి బయటికి తీశారు. ఇలా వాట్సాప్ సాయంతో ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, అతడి కుటుంబంలోని కొందరి జాడ తెలియలేదు.
28వేలు దాటిన మృతులు
Turkey Earthquake death toll: భూకంప విలయం వల్ల టర్కీ, సిరియా (Syria) లో మృతుల సంఖ్య 28,617 దాటింది. సోమవారం (ఫిబ్రవరి 7) 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం సహా ఆ తర్వాత సంభవించిన మరిన్ని భూకంపాలకు టర్కీ, సిరియాలో వేలాది భవనాలు కుప్పకూలాయి. ఇప్పటి వరకు టర్కీలో 24,617 మంది, సిరియాలో 3,574 మంది చనిపోయారు. 50 లక్షల మందికి పైగా నిరాశ్రయిలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని ఐక్యరాజ్య సమతికి కూడా అంచనా వేసింది. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇండియాతో పాటు చాలా దేశాలు టర్కీ, సిరియాకు సహాయక సిబ్బందిని పంపాయి. వైద్య సాయం చేస్తున్నాయి.
సంబంధిత కథనం