iPhone users alert: ఈ ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు-whatsapp not works on ios 10 and ios 11 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iphone Users Alert: ఈ ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు

iPhone users alert: ఈ ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు

Praveen Kumar Lenkala HT Telugu
Sep 02, 2022 05:52 PM IST

iPhone users alert: వాట్సాప్ కొన్ని ఐఫోన్ మోడల్స్‌పై అక్టోబరు 24 నుంచి పనిచేయదు. ఆ వివరాలు ఇవే..

<p>ఆపిల్ ఐఫోన్లలో కొన్ని మోడల్స్‌లో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు</p>
ఆపిల్ ఐఫోన్లలో కొన్ని మోడల్స్‌లో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు

WhatsApp not works on these models: కొన్ని పాత ఐఫోన్ మొబైల్స్‌పై వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. మాషేబుల్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం ఈ మెసేజింగ్ యాప్ ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 వెర్షన్ మొబైల్స్‌లో అక్టోబరు 24 నుంచి పనిచేయదు. వాట్సాప్ ఇప్పటికే ఆయా ఐఫోన్ యూజర్లను అలెర్ట్ చేసినట్టు సంబంధిత నివేదిక తెలిపింది.

ఐఫోన్లలో ఇప్పుడు ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 సాఫ్ట్‌వేర్ రావడం లేదు. తాజా పరిణామం వల్ల ఐఫోన్ 5, ఐఫోన్ 5ఎస్ మోడల్స్‌లో వాట్సాప్ పనిచేయదని మాషేబుల్ ఇండియా తెలిపింది.

ఈ మెసేజింగ్ యాప్ సేవలు పొందాలంటే యూజర్లు తమ ఐఫోన్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐఓఎస్ వెర్షన్ ఎలా అప్‌డేట్ చేయాలి?

ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 రెండూ కాలం చెల్లిన ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపిల్ ఫోన్స్‌లో దాదాపు తాజా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇప్పటికీ అప్‌డేట్ చేయకపోతే వెంటనే చేసుకోవాల్సి ఉంటుంది.

తాజా ఐఓఎస్ వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలంటే సెటింగ్స్‌లోకి వెళ్లి జనరల్ అనే టాబ్ నొక్కి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలి.

ఐఓఎస్ 12 లేదా కొత్త ఐఓఎస్ వెర్షన్లపై మాత్రమే తమ సేవలు అందుతాయని వాట్సాప్ ఇదివరకే ప్రకటించింది. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 4.1 లేదా అంతకంటే కొత్త వెర్షన్లలో మాత్రమే తమ సేవలు అందుతాయని వాట్సాప్ తెలిపింది.

ఆపిల్ సెప్టెంబరు 7న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనుంది. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగు ఐఫోన్లను ఆవిష్కరించనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్, ఐఫోన్ 14 మాక్స్ తదితర నాలుగు కొత్త ఫోన్లను ఆవిష్కరించనుంది.

ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మొబైల్స్‌లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉండబోతున్నాయని మింగ్-చి కో తెలిపింది.

Whats_app_banner

టాపిక్