IMD rain alert : ఐఎండీ అలర్ట్- తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..
Telangana Rains : దేశంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ సహా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వర్షసూచన ఇచ్చింది ఐఎండీ. పూర్తి వివరాలు..
దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల వాతావరణ అప్డేట్స్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. బీహార్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలో ఈ వారం మొత్తం చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 18న విడుదల చేసిన తాజా ప్రకటనలో వాతావరణ అబ్జర్వేటరీ ఈ రోజు, రాబోయే రోజుల్లో సవివరమైన వాతావరణ అప్డేట్స్ని ఇచ్చింది. మింట్ నివేదిక ప్రకారం, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) 13 సంవత్సరాలలో సుదీర్ఘ నిరంతర వర్షపాతాన్ని చూస్తోంది, వరుసగా 14 రోజుల పాటు వర్షాలు కురుశాయని భారత వాతావరణ విభాగం తెలిపింది.
ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 20, 21 తేదీల్లో పంజాబ్, హరియాణా-చండీగఢ్; 21-24 తేదీల్లో తూర్పు ఉత్తరప్రదేశ్; ఆగస్టు 22-24 తేదీల్లో తూర్పు రాజస్థాన్లో జోరుగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
ఇక పశ్చిమ, మధ్య భారతంలో ఈ వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయి. 24న విదర్భ; ఛత్తీస్గఢ్లో ఆగస్టు 20 వరకు, కొంకణ్, గోవాలో ఆగస్టు 22 వరకు, గుజరాత్ ప్రాంతంలో ఆగస్టు 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
తూర్పు, ఈశాన్య భారతంలో భారీ వర్షాలు..
బీహార్లో ఆగస్టు 23 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 21 వరకు ఝార్ఖండ్. ఆగస్టు 20, 23, 24 తేదీల్లో ఒడిశా. ఆగస్టు 19-21 మధ్య పశ్చిమ బెంగాల్, సిక్కిం, మేఘాలయలో వర్షాలు పడతాయి.
ఆగస్టు 20న తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, 20-21 తేదీల్లో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రాగల ఆరు రోజుల పాటు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది.
ఆగస్టు 22వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఆగస్టు 22 నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
సంబంధిత కథనం