USA News: అర్ధరాత్రి.. వరుసగా ఫుడ్ డెలివరీ.. బిల్లు 80 వేలు.. అసలేం జరిగింది?-wait what 6 year old orders food worth rs 80 000 from his dad s phone ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Usa News: అర్ధరాత్రి.. వరుసగా ఫుడ్ డెలివరీ.. బిల్లు 80 వేలు.. అసలేం జరిగింది?

USA News: అర్ధరాత్రి.. వరుసగా ఫుడ్ డెలివరీ.. బిల్లు 80 వేలు.. అసలేం జరిగింది?

HT Telugu Desk HT Telugu
Feb 04, 2023 02:50 PM IST

6 Years boy orders food worth ₹80,000: అమెరికాకు చెందిన కీత్ స్టోన్ హౌజ్ (Keith Stonehouse) అనే వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి డెలివరీ అయిన సుమారు రూ. 80 వేల విలువైన ఫుడ్ ను ఏం చేసుకోవాలో తెలియక ఇలా ఫొటోకు ఫోజిచ్చాడు.

ఆరేళ్ల కొడుకు చేజ్ తో కీత్ స్టోన్ హౌజ్
ఆరేళ్ల కొడుకు చేజ్ తో కీత్ స్టోన్ హౌజ్ (Instagram/@keithstonehouse)

6 Years boy orders food worth 80,000: అసలేం జరిగిందో కీత్ స్టోన్ హౌజ్ (Keith Stonehouse) తన ఇన్ స్టా పోస్ట్ లో వివరించాడు. అది తన ఆరేళ్ల కొడుకు చేజ్ (Chase) చేసిన ఘనకార్యమని వెల్లడించాడు. ఏడవలేక, నవ్వుతూ ఇన్ స్టా లో ఈ పోస్ట్ పెడుతున్నానని చమత్కరించాడు.

6 Years boy orders food worth 80,000: ఇంతకీ ఏం జరిగిందంటే..

కాసేపు మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటానంటే రాత్రి సమయంలో కీత్ స్టోన్ హౌజ్ తన కుమారుడు చేజ్ కు తన ఫోన్ ఇచ్చాడు. ఆ తరువాత ఆ విషయం మర్చిపోయి, తన పనిలో మనిగిపోయాడు. ఆ తరువాత కాసేపటికి డోర్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీస్తే, అక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ నిల్చుని ఉన్నాడు. ఫుడ్ ప్యాకెట్ ను డెలివరీ చేసి వెళ్లిపోయాడు. విషయమేంటని కీత్ కొడుకు దగ్గర నుంచి ఫోన్ లాక్కుని చూస్తూ, వరుసగా నోటిఫికేషన్లు వస్తూ కనిపించాయి. అన్నీ ఫుడ్ డెలివరీ యాప్ గ్రబ్ హబ్ (Grubhub) నుంచే. ‘మీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ అయింది..’, ‘మీ ఫుడ్ ప్రిపేర్ అవుతోంది’.., ‘మీ ఫుడ్ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది’. ‘మీ ఫుడ్ ఆన్ ది వే టు డెలివరీ’ వంటి మెసేజ్ లు, అలాగే, అకౌంట్ నుంచి మనీ డిడక్ట్ అయినట్లుగా చూపే మెసేజ్ లు కుప్పలుగా కనిపించాయి. దాంతో షాక్ తిన్న కీత్ స్టోన్ హౌజ్ విషయమేంటని ఆరా తీస్తే, తానే ఆ ఆర్డర్స్ ఇచ్చానని చావు కబురు చల్లగా చెప్పాడు చేజ్. అప్పటికే ఆ ఆర్డర్స్ ను కేన్సిల్ చేసే టైమ్ కూడా ముగిసింది. దాంతో, వరుసగా వస్తున్న ఫుడ్ ఆర్డర్స్ ను రిసీవ్ చేసుకోవడం మినహా ఏం చేయలేకపోయాడు. ఇదంతా పైనున్న తన రూమ్ లో కూర్చుని చిద్విలాసంగా గమనిస్తున్నాడట ఆ నాటీ బోయ్. అంతేకాదు, ఆర్డర్స్ అన్నింటినీ జాగ్రత్తగా చెక్ చేయమని, తన చీజ్ పీజా వచ్చిందా? లేదా? చూడమని సలహాలు కూడా ఇచ్చాడంట.

6 Years boy orders food worth 80,000: బిల్లెంతో తెలుసా?

ఇంతకీ చేజ్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కు అయిన బిల్లు ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 80 వేలు. అమెరికా కరెన్సీలో సుమారు 1000 డాలర్లు ($1000). ఆర్డర్ ఇచ్చిన ఆరేళ్ల చేజ్ ఎంత మంచి వాడంటే, ప్రతీ ఆర్డర్ కీ 25% టిప్ కూడా ఇచ్చాడు. మొత్తంగా డెలివరీ అయిన ఫుడ్ ను ఒక దగ్గర పెడితే, చిన్నపాటి కొండలా కనిపించిందట. ఇంతకీ చేజ్ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స ఏంటో తెలుసా.. జంబో ష్రింప్ (jumbo shrimp), సాలాడ్స్ (salads), హానిస్ (hanis), చికెన్ షావర్మా (chicken shawarma), చిల్లీ చీజ్ ఫ్రైస్ (chili cheese frie), చికెన్ సాండ్ విచెస్ (chicken sandwiches), కుప్పలు, కుప్పలుగా ఐస్ క్రీమ్ (ice cream). ఇవన్నీ ఏం చేసుకోవాలో తెలియక, దగ్గర్లో ఉన్న తెలిసిన వారందరికీ ఫోన్ చేసి, విషయం చెప్పి, పార్టీకి ఇన్వైట్ చేశాడట కీత్ స్టోన్ హౌజ్.

Whats_app_banner