Sharad Yadav death : కేంద్ర మాజీ మంత్రి శరద్​ యాదవ్​ కన్నుమూత-veteran rjd leader former union minister sharad yadav passes away ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sharad Yadav Death : కేంద్ర మాజీ మంత్రి శరద్​ యాదవ్​ కన్నుమూత

Sharad Yadav death : కేంద్ర మాజీ మంత్రి శరద్​ యాదవ్​ కన్నుమూత

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 13, 2023 06:56 AM IST

Sharad Yadav died : కేంద్ర మాజీ మంత్రి శరద్​ యాదవ్​ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీతో పాటు అనేక మంది నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శరద్​ యాదవ్​ కన్నుమూత
శరద్​ యాదవ్​ కన్నుమూత (PTI)

Sharad Yadav news : కేంద్ర మాజీ మంత్రి, దేశంలోని దిగ్గజ సోషలిస్ట్​ నేతల్లో ఒకరైన శరద్​ యాదవ్​ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న 75ఏళ్ల శరద్​ యాదవ్​.. గురువారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆయన్ని గురుగ్రామ్​లోని ఫోర్టిస్​ మెమోరియల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​కు తరలించారు. చికిత్స పొందుతూ.. ఆసుపత్రిలో రాత్రి 10:19 గంటలకు తుదిశ్వాస విడిచారు.

"అపస్మారక స్థితిలో ఆయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన దేనికీ స్పందించలేదు. పరీక్ష నిర్వహించగా.. పల్స్​, బ్లడ్​ ప్లెజర్​ను గుర్తించలేకపోయాము. సీపీఆర్​ చేశాను. అన్ని విధాలుగా చికిత్స అందించేందుకు ప్రయత్నించాము. కానీ ఆయన్ని కాపాడలేకపోయాము," అని ఆసుపత్రి ఓ ప్రకటనను విడుదల చేసింది.

Sharad Yadav death : స్టూడెంట్​ లీడర్​గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శరద్​ యాదవ్​.. కాంగ్రెస్​కు వ్యతిరేకంగా దశాబ్దాల పాటు గళమెత్తారు. జయప్రకాశ్​ నారాయణ్​ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. విపక్షంలో కీలక నేతగా ఎదిగారు. కాగా.. 2015 బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్​తో పాటు తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్​ యాదవ్​తో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు.

నాటి అటల్​ బీహారీ వాజ్​పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు శరద్​ యాదవ్​. అంతకు ముందు.. 1989లో వీపీ సింగ్​ ప్రభుత్వంలోనూ యూనియన్​ మినిస్టర్​గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

Sharad Yadav died : శరద్​ యాదవ్​.. మూడుసార్లు రాజ్యసభకు, 7సార్లు లోక్​సభకు ఎన్నికయ్యారు. బీహార్​లోని జనతా దళ్​ యునైటెడ్​ (జేడీ-యూ)కు వ్యవస్థాపక సభ్యుడైన శరద్​ యాదవ్​.. నితీశ్​ కుమార్​ బీజేపీతో చేతులు కలపడంతో పార్టీ నుంచి బయటకొచ్చేశారు.

2018లో సొంతంగా.. లోక్​తాంత్రిక్​ జనతా దళ్​ను స్థాపించారు శరద్​ యాదవ్​. రెండేళ్ల తర్వాత.. ఆ పార్టీని ఆర్​జేడీలో కలిపేశారు. "విపక్షాల ఐకమత్యానికి తొలి అడుగు" అంటూ.. నాటి పరిణామాల మధ్య వ్యాఖ్యలు చేశారు ఈ దిగ్గజ నేత.

శరద్​ యాదవ్​ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

Sharad Yadav death news : "శరద్​ యాదవ్​ మరణ వార్త బాధ కలిగించింది. సుదీర్ఘ ప్రజా సేవలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. డా. లోహియ సిద్ధాంతాలతో ఎంతో స్ఫూర్తిపొందారు. మా మధ్య సంభాషణలను నేను ఎన్నటికి మర్చిపోను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి," అని మోదీ ట్వీట్​ చేశారు.

"ఆర్​జేడీ సీనియర్​ నేత శరద్​ యాదవ్​ అకాల మరణం నన్ను కలచివేసింది. ఆయనొక గొప్ప సోషలిస్ట్​ నేత. నా గురువు. నాకు మాటలు రావడం లేదు. ఈ బాధాకర సమయంలో ఆయన కుటుంబానికి మేము మద్దతుగా ఉంటాము," అని ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ అన్నారు.

Sharad Yadav political career : చికిత్స కోసం సింగపూర్​కు వెళ్లిన ఆర్​జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్​ యాదవ్​ సైతం.. శరద్​ యాదవ్​ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"మా మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. కానీ మేము ఎప్పుడు ఒకరిని ఒకరు ద్వేషించుకోలేదు. శరద్​ యాదవ్​, ములాయం సింగ్​ యాదవ్​, నితీశ్​ కుమార్​, నేను.. అందరం రామ్​ మనోహర్​ లోహియ, కర్పూరీ ఠాకూర్​ వద్ద సోషలిజం, రాజకీయాలను నేర్చుకున్నాము," అని.. ఆసుపత్రి నుంచి ఓ వీడియో మెసేజ్​ విడుదల చేశారు లాలూ ప్రసాద్​ యాదవ్​.

IPL_Entry_Point

సంబంధిత కథనం