Bihar CM Nitish Kumar: ఇలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీని భారీగా ఓడించవచ్చు: నితీశ్ కుమార్-no third front for 2024 lok sabha elections bihar cm nitish kumar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bihar Cm Nitish Kumar: ఇలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీని భారీగా ఓడించవచ్చు: నితీశ్ కుమార్

Bihar CM Nitish Kumar: ఇలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీని భారీగా ఓడించవచ్చు: నితీశ్ కుమార్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 11, 2022 06:31 PM IST

Bihar CM Nitish Kumar on Lok Sabha Polls: 2024 లోక్‍సభ ఎన్నికల గురించి బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే 2020 ఎన్నికల్లో బీజేపీ తమ పార్టీపై కుట్రలు చేసిందనేలా ఆరోపణలు చేశారు.

Bihar CM Nitish Kumar: ఇలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీని భారీగా ఓడించవచ్చు: నితీశ్ కుమార్
Bihar CM Nitish Kumar: ఇలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీని భారీగా ఓడించవచ్చు: నితీశ్ కుమార్ ((ANI Photo))

Bihar CM Nitish Kumar on Lok Sabha Polls: 2024 లోక్‍సభ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ (Third Front) ఉండబోదని జనతా దళ్ (యునైటెడ్) (JDU) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. 2024 ఎన్నికల్లో మెయిన్ ఫ్రంటే ఉంటుందని అన్నారు. పార్టీ నేతలతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నితీశ్ మాట్లాడారు. 2024 లోక్‍సభ ఎన్నికల ప్రణాళిక గురించి వ్యాఖ్యానించారు. 2020 ఎన్నికల్లో తమ పార్టీపై బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు.

అలా అయితే బీజేపీపై గెలవొచ్చు

Bihar CM Nitish Kumar on Lok Sabha Polls: ప్రతిపక్షాలన్నీ చేతులు కలిపేందుకు అంగీకరిస్తే 2024 లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీపై భారీ మెజార్టీతో విజయం సాధించవచ్చని నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. విపక్షాలు ఐకమత్యంతో ముందుకు సాగితే కమలం పార్టీని ఓడించవచ్చని చెప్పారు. మొత్తంగా కాంగ్రెసేతర మూడో కూటమి సాధ్యం కాదనేలా ఆయన వ్యాఖ్యానించారు.

2020లో కుట్ర జరిగింది

2020 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న బీజేపీనే తమకు వ్యతిరేకంగా పని చేసిందని జేడీయూ బాస్ నితీశ్ కుమార్ అన్నారు. తమ పార్టీ ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడానికి ఆ పార్టీనే కారణం అనేలా మాట్లాడారు. “మునుపెన్నడూ లేని విధంగా 2020 ఎన్నికల్లో మా పార్టీ అతితక్కువ సీట్లు సాధించిందని వారు (బీజేపీ) గుర్తుపెట్టుకోవాలి. 2005, 2010 ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి. అయితే 2020లో, వారు మా అభ్యర్థులనే ఓడించేందుకు ప్రయత్నించటంతో మేం ఇబ్బంది పడ్డాం” అని నితీశ్ కుమార్ చెప్పారు. 2020 ఎన్నికల్లో జేడీయూను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నిందనేలా వ్యాఖ్యలు చేశారు నితీశ్.

2020 ఎన్నికల్లో బీజేపీతో కలిసి కూటమిగా జేడీయూ పోటీ చేసింది. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ ఏడాది ఆగస్టులో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు సీఎం నితీశ్ కుమార్. ఆర్‍జేడీతో చేతులు కలిపి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కేంద్రం ఏం ఇవ్వట్లేదు

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి ఏం ఇవ్వడం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ విమర్శించారు. “బిహార్ ఏమీ పొందటం లేదు (కేంద్ర ప్రభుత్వం నుంచి). ప్రత్యేక హోదా డిమాండ్ ఆమోదం పొందలేదు. బ్రిటీష్ పాలన నుంచి ధనిక ప్రాంతంగా ఉన్న గుజరాత్‍కు చెందిన వారు ఆయన (ప్రధాని మోదీ). పేద రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం పురోగతి చెందదు” అని నితీశ్ కుమార్ అన్నారు.

IPL_Entry_Point