రష్యాకు అమెరికా మరో షాక్​.. చమురు దిగుమతులపై నిషేధం-us bans russian oil imports as biden warns of costs ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రష్యాకు అమెరికా మరో షాక్​.. చమురు దిగుమతులపై నిషేధం

రష్యాకు అమెరికా మరో షాక్​.. చమురు దిగుమతులపై నిషేధం

HT Telugu Desk HT Telugu
Mar 08, 2022 11:20 PM IST

US Russia oil | రష్యా చమురు దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ ప్రకటించారు. కానీ అమెరికన్లకు ఖర్చులెక్కువ అవుతాయని హెచ్చరించారు.

<p>జో బైడెన్​</p>
<p>జో బైడెన్​</p> (AP)

US Russia oil ban | ఉక్రెయిన్​పై యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న రష్యాపై మరో పిడుగు పడింది. రష్యా చమురు, గ్యాస్​ దిగుమతులను నిషేధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ మంగళవారం ప్రకటించారు. యుద్ధం మొదలుపెట్టిన రష్యా.. మూల్యం చెల్లించుకోవాలని వ్యాఖ్యానించారు.

వాస్తవానికి కొన్ని రోజులుగా రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడుతున్నాయి ప్రపంచ దేశాలు. కానీ రష్యా చమురు వ్యవహారంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఫలితంగా రష్యాకు డబ్బులు వెళుతూనే ఉన్నాయి. వాటిపైనా ఆంక్షలు విధించి, రష్యాను ఉక్కిరిబిక్కిరి చేయాలని ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బైడెన్​ ఈ ప్రకటన చేశారు.

అమెరికన్లకు చేదు వార్తే!

రష్యా చమురు నిషేధంతో అమెరికన్లపైనా భారం పడనుంది. ఈ విషయాన్ని బైడెన్​ స్వయంగా చెప్పారు.

US Russia oil sanctions | "రష్యాను మేము అడ్డుకుంటాము. అందుకే చమురుపై నిషేధం విధించాము. ఇది ఆ దేశానికి గట్టిదెబ్బ లాటింది. కానీ ఇది అమెరికన్లపైనా ప్రభావం చూపిస్తుంది. గ్యాస్​ ధరలు పెరుగుతాయి. ఫ్రీడంను కాపాడుకోవాలంటే ఖర్చులు పెంచాల్సిందే," అని బైడెన్​ అన్నారు.

వాస్తవానికి రష్యా చమురుపై నిషేధం విధించడాన్ని బైడెన్​ కూడా తొలుత వ్యతిరేకించారు. ధరలు పెరుగుతాయని ఆయన భావించారు. ఇదే జరిగితే.. అగ్రరాజ్యంలో ఈ ఏడాది నవంబర్​లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల గెలుపోటములపై ప్రభావం పడుతుందని ఆయన ఆలోచించారు. కానీ నిషేధం విధించిక తప్పలేదు.

ఈయూ పరిస్థితేంటి?

రష్యా చమురుపై ఈయూతో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్​ తెలిపారు. మరి ఇప్పుడు యూరోపియన్​ యూనియన్​ కూడా నిషేధం విధిస్తుందా? అన్నది చూడాలి.

చమురు విషయంలో అమెరికా- ఈయూ మధ్య సమీకరణలు పూర్తిగా మారిపోతాయి. చమురు, గ్యాస్​ ఉత్పత్తిదారుగా ఉన్న అమెరికాలో దిగుమతులు చాలా తక్కువ. కానీ యూరోప్​ మాత్రం అందుకు పూర్తి భిన్నం. 90శాతం గ్యాస్​, 97శాతం చమురు ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటుంది. వీటిల్లో 40శాతం వాటా రష్యాదే.

అయితే చమురు విషయంలో రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటామని ఈయూ నేతలు హామీనిచ్చారు. ఈ ఏడాదిలోనే ప్రణాళికలు అమలు చేస్తామని చెప్పారు. కానీ అవి అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది.

సంబంధిత కథనం

టాపిక్