PM Modi comments on Urban Naxals: ’అర్బన్ నక్సల్స్ తో జాగ్రత్త..’
PM Modi comments on Urban Naxals: వివిధ కారణాలు చూపుతూ అర్బన్ నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
PM Modi comments on Urban Naxals: అర్బన్ నక్సల్స్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ మద్దతు ఉన్న అభివృద్ధి నిరోధకులు, అర్బన్ నక్సలైట్లు పర్యావరణానికి ప్రమాదమంటూ గుజరాత్ లో నిర్మించ తలపెట్టిన సర్దార్ సరోవర్ డ్యామ్ అడ్డుకోవడానికి ప్రయత్నించారని ప్రధాని మోదీ ఆరోపించారు. దాంతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమై, కోట్లాది ప్రజాధనం వృధా అయిందన్నారు.
PM Modi comments on Urban Naxals: రాష్ట్రాల మంత్రులకు సలహా
పర్యావరణ పరిరక్షణ పేరుతో అర్బన్ నక్సలైట్లు, ఇతర అభివృద్ధి నిరోధకులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాల మంత్రులకు ప్రధాని సూచించారు. అనవసరంగా ప్రాజెక్టులు నిలిచిపోకుండా చూసుకోవాలన్నారు. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే సమయంలోనే అన్ని అంశాలను కూలంకశంగా పరిశీలించి, ఇలాంటి అభివృద్ధి నిరోధక శక్తుల కుట్రలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
PM Modi comments on Urban Naxals: మంత్రుల సదస్సు
రాష్ట్రాల పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సదస్సు గుజరాత్ లోని నర్మద జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నర్మద డ్యామ్ నిర్మాణ సమయం నాటి అనుభవాలను ప్రధాని మోదీ వివరించారు. డ్యామ్ నిర్మాణం ముగిసిన తరువాత ఈ డ్యామ్ అవసరం, వినియోగం అందరికీ అర్థమైందని, ఇప్పుడు ఈ డ్యామ్ పరిసరాలు తీర్థ క్షేత్రంలా మారాయని వివరించారు.
PM Modi comments on Urban Naxals: ప్రధాని నోట అర్బన్ నక్సలైట్ పదం
జన జీవనంలో ఉంటూ నక్సలైట్లకు మద్దతిస్తున్న శక్తులను ఈ మధ్య అర్బన్ నక్సలైట్లుగా పిలుస్తున్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిని కూడా అర్బన్ నక్సలైట్లు అంటూ వేధిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, ప్రధాన మంత్రి నోటి వెంట ఈ అర్బన్ నక్సలైట్లన్న పదం రావడంపై చర్చ సాగుతోంది. అర్బన్ నక్సలైట్లు ఇంకా క్రియాశీలంగానే ఉన్నారని, వారికి వివిధ రాజకీయ పార్టీలు, వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని ప్రధాని ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా నర్మద బచావో ఆందోళన్ నాయకురాలు మేథా పట్కర్ ను అర్బన్ నక్సల్ అంటూ వాఖ్యానించారు.