UPSC Recruitment 2023 : వివిధ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్.. నేటి నుంచి అప్లికేషన్
UPSC Recruitment 2023 : వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేసింది యూపీఎస్సీ. శనివారం నుంచి అప్లికేషన్లను స్వీకరించనుంది.
UPSC Recruitment 2023 : వివిధ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). ఈ దఫా రిక్రూట్మెంట్లో సైంటిఫిక్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్), టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ లెక్చరర్ (ఒబ్స్టెట్రిక్స్- గైనకాలజీ) పోస్టులను భర్తీ చేయనుంది. అప్లికేషన్ ప్రక్రియ.. శనివారం, డిసెంబర్ 9న ప్రారంభంకానుంది. అప్లికేషన్లు వేసేందుకు చివరి తేదీ.. డిసెంబర్ 28. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు.. www.upsconline.nic.in. లేదా upsc.gov.in వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి అప్లికేషన్లు వేయవచ్చు.
యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2023 వివరాలు..
ఈ దఫా రిక్రూట్మెంట్లో 5 ఖాళీలను భర్తీ చేయనుంది యూపీఎస్సీ. నేషనల్ టెస్ట్ హౌజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూర్ అఫైర్స్, పుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఒక సైంటిఫిక్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) పోస్టు ఖాళీగా ఉంది.
UPSC Recruitment 2023 apply online : మరో మూడు వేకెన్సీలు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్‌కు చెందిన కంప్యూటర్ అండ్ సిస్టెమ్ డివిజన్లో ఉంది.
మిగిలిన ఒక్క పోస్టు.. సీనియర్ లెక్చర్ (ఒబ్స్టెట్రిక్స్- గైనకాలజీ), ఛండీగఢ్ ప్రభుత్వ వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్జ్యూకేషన్ అండ్ రీసెర్చ్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉంది.
UPSC Recruitment 2023 notification : అప్లికేషన్ ఫీజు:- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఉచితం. ఇతరులు రూ. 25 చెల్లించాలి.
నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల విడుదల..
UPSC CSE Mains Result 2023 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. డిసెంబర్ 8న 2023 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్, 2023 పరీక్ష ఫలితాలను చూసుకోవడానికి ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. ను ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో కనిపిస్తున్న UPSC Mains Result 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
ఒక పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో రోల్ నంబర్ ఆధారంగా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఆ పీడీఎఫ్ ని డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసి పెట్టుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం