UPSC Civil Service Prelims 2023 Admit Cards : యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (Preliminary) పరీక్ష అడ్మిట్ కార్డులు సోమవారం (మే 8) విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. మే 28వ తేదీన దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూపీఎస్‍సీ అధికారిక వెబ్‍సైట్ upsc.gov.in ద్వారా అడ్మిట్ కార్డు డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.
UPSC Civil Service Prelims 2023 Admit Cards : అడ్మిట్ కార్డులోని వివరాలను అభ్యర్థులు క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే యూపీఎస్‍సీకి తెలియజేయాలి. అడ్మిట్ కార్డు ప్రింటౌట్‍ను పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు తప్పకుండా తీసుకెళ్లాలి. సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు అడ్మిట్ కార్డును జాగ్రత్తగా దాచుకోవాలి. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‍పోర్టు లాంటి ఏదైనా ఓ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.