Court orders survey of Shahi Idgah mosque: తెరపైకి మథుర ‘కృష్ణ జన్మభూమి’ వివాదం
Sri Krishna Janmabhoomi dispute: మరో వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని మథురలో ఉన్న ‘శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా’ కేసులో శనివారం స్థానిక కోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది.
Sri Krishna Janmabhoomi dispute: మథుర లో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా కేసుకు సంబంధించిన వివాదాస్పద భూమిని సర్వే చేయాలని మథుర లోని స్థానిక సివిల్ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది.
Sri Krishna Janmabhoomi dispute: జనవరి 20 లోగా
వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు వివాదం విషయంలో వారణాసి సివిల్ కోర్టు ఇచ్చిన తరహాలోనే వివాదాస్పద ప్రాంతాన్ని వీడియో సర్వే చేయాలని మథుర సివిల్ కోర్టు ఆదేశాలివ్వడం గమనార్హం. జనవరి 20 లోగా సర్వే పూర్తి చేసి, కోర్టుకు నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. హిందు సేన దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు పై ఆదేశాలను జారీ చేసింది. స్థానిక అమిన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సర్వేకు సంబంధిత వర్గాలన్నీ సహకరించాలని ఆదేశించింది.
Sri Krishna Janmabhoomi dispute: హిందు సేన పిటిషన్
హిందు సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ మథురలోని సివిల్ కోర్టులో డిసెంబర్ 8న ఈ కేసును వేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలపై మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి ప్రాంతంలోని 13.37 ఎకరాల్లోని ఆలయాన్ని ధ్వంసం చేసి షాహీ ఈద్గాను నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు. ఆ తరువాత, శ్రీ కృష్ణ జన్మభూమి సేవా సంఘ్, షాహీ మసీదు ఈద్గా ల మధ్య 1968లో కుదిరిన ఒప్పందాన్ని కూడా పిటిషనర్లు సవాలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సివిల్ కోర్టు సీనియర్ డివిజన్ 3 న్యాయమూర్తి సోనికా వర్మ శనివారం శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా కేసుకు సంబంధించిన వివాదాస్పద భూమిని సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Sri Krishna Janmabhoomi dispute: 1991 ప్రార్థన స్థలాల చట్టం
మథుర లోని షాహీ ఈద్గా మసీదు1991 నాటి ప్రార్థన స్థలాల చట్టం(Places of Worship Act, of 1991) పరిధిలోకి వస్తుంది. 1947, ఆగస్ట్ 15 నాటికి, ఈ చట్టంలో పేర్కొన్న ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో, వాటి యథాతథ స్థితిని కొనసాగించాలని స్థూలంగా ఆ చట్టం స్పష్టం చేస్తుంది.