SBI electoral bonds : "రేపటి కల్లా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను సమర్పించండి?"- ఎస్బీఐకి సుప్రీం ఆదేశం
Supreme court hearing on electoral bonds : ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐ వేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు విచారించింది. ఈసీకి వివరాలు ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరిన ఎస్బీఐపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.
SBI electoral bonds hearing : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో ఆలస్యం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. ఈ మేరకు.. వివరాలను సమర్పించేందుకు జూన్ 30 వరకు సమయం కావాలని ఎస్బీఐ వేసిన పిటిషన్‌ని పక్కనపెట్టేసింది. మంగళవారం సాయంత్రం నాటికి.. ఎట్టిపరిస్థితుల్లోనైనా వివరాలను సమర్పించాలని, ఆ వివరాలను.. ఎన్నికల సంఘం.. మార్చ్ 15 నాటికి తమ వెబ్సైట్లో పబ్లీష్ చేయాలని తేల్చిచెప్పింది.
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో ఎస్బీఐకి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.
'మా ఆదేశాలను ఎందుకు పాటించలేదు?'
రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి నిధులను అనుమతించే కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని తేల్చుతూ.. స్కీమ్‌ని ఇటీవలే రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఏప్రిల్ 12, 2019 నుంచి అమ్ముడుపోయిన బండ్స్కి సంబంధించిన వివరాలను.. మార్చ్ 6 నాటికి ఈసీకి ఇవ్వాలని ఎస్బీఐకి ఆదేశాలిచ్చింది. ఆ వివరాలను.. ఎన్నికల సంఘం.. మార్చ్ 13 నాటికి తమ అధికారిక వెబ్సైట్లో పబ్లీష్ చేయాలని స్పష్టం చేసింది.కానీ చివరి నిమిషంలో.. మార్చ్ 4న.. వివరాలు ఇచ్చేందుకు గడువును పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఎస్బీఐ.
"ఇలాంటి విషయంలో మీరు గడువు పొడిగించాలని అడగటం చాలా సీరియస్ విషయం. మా తీర్పు, ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి," అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Supreme court on electoral bonds : ఎస్బీఐ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. అన్ని వివరాలను సేకరించేందుకు మరింత సమయం పడుతుందని, అందుకే గడువును పొడిగించాలని కోరినట్టు తెలిపారు.
ఆ మాటలు విన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. "వివరాలను సీల్డ్ కవర్లో పెట్టి ముంబై బ్రాంచ్‌కి సమర్పించినట్టు మీరే చెప్పారు. వివరాలను మ్యాచ్ చేసి సమర్పించాలని మేము చెప్పలేదు. డోనర్స్‌కి చెందిన వివరాలను ఇవ్వాలని ఎస్బీఐకి స్పష్టంగా చెప్పాము. మా తీర్పును మీరు ఎందుకు పాటించలేదు?" అని అడిగారు.
"సీల్డ్ కవర్లో అన్ని వివరాలు ఉంటే.. సింపుల్‌గా ఆ కవర్ని ఓపెన్ చేసి, వివరాలు ఇవ్వొచ్చు కదా?" అని ప్రశ్నించారు జస్టిస్ ఖన్నా.
అసలేంటి వివాదం..?
మరోవైపు.. జూన్ 30 వరకు సమయం కావాలని సీబీఐ చేసిన విజ్ఞప్తికి వ్యతిరేకంగా మరో పిటిషన్ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకు డోనర్స్ పేరును బయట పెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఎస్బీఐ.. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను దాచిపెడుతోందని వ్యాజ్యంలో పేర్కొంది అసొసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అండ్ కామన్ కాస్.
ఏ వ్యక్తి అయినా లేదా ఏ సంస్థ అయినా.. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలని అనుకుంటే.. ఎేస్బీఐ దగ్గరికి వెళ్లి ఈ ఎలక్టోరల్ బాండ్స్‌ని కొనాల్సి వచ్చేది. ఇందులో డోనర్ పేరును సీక్రెట్‌గా ఉంటుంది. ఎవరు ఇచ్చారు? అన్న విషయం ఎవరికీ తెలియదని కేంద్రం చెబుతూ వచ్చింది. కానీ.. డోనర్స్ వివరాలను పూర్తిగా ట్రేస్ చేయవచ్చని.. ఎలక్టోరల్ బాండ్స్ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని పలు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటినీ సుదీర్ఘ కాలం పాటు విచారించిన సుప్రీంకోర్టు.. ఎలక్టోరల్ బాండ్స్‌ని రద్దు చేసింది.
సంబంధిత కథనం