Pakistan PM : పాకిస్థాన్​ ప్రధానిగా షెహ్​బాజ్​ షరీఫ్​ ప్రమాణం..-shehbaz sharif elected pakistans prime minister for a second time ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Pm : పాకిస్థాన్​ ప్రధానిగా షెహ్​బాజ్​ షరీఫ్​ ప్రమాణం..

Pakistan PM : పాకిస్థాన్​ ప్రధానిగా షెహ్​బాజ్​ షరీఫ్​ ప్రమాణం..

Sharath Chitturi HT Telugu
Mar 03, 2024 03:55 PM IST

Pakistan new prime minister : పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ దేశ స్పీకర్​ ప్రకటన చేశారు.

 పాకిస్థాన్​ ప్రధానిగా షెహ్​బాజ్​ షరీఫ్​ ప్రమాణం..
పాకిస్థాన్​ ప్రధానిగా షెహ్​బాజ్​ షరీఫ్​ ప్రమాణం.. (AFP)

Pakistan PM Shehbaz Sharif : పాకిస్థాన్​లో రాజకీయ ప్రతిష్ఠంభణకు తెరపడింది! ఆ దేశ ప్రధానిగా షెహ్​బాజ్​ షరీఫ్​ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్​లో.. అరుపులు, గందరగోళం, నిరసనల మధ్య జరిగిన ఓటింగ్​ ప్రక్రియలో 201 ఓట్లతో షెహ్​బాజ్​ ఎన్నికయ్యారని స్పీకర్​ ఆదివారం ప్రకటించారు.

బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)తో కలిసి పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు చెందిన షెహ్​బాజ్ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు గల ఇండిపెండెంట్లు అత్యధిక సంఖ్యలో విజేతలుగా నిలవగా, పీఎంఎల్-ఎన్, పీపీపీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ తన తమ్ముడు షెహ్​బాజ్ షరీఫ్, పార్టీ విధేయుడు సర్దార్ అయాజ్ సాదిక్​లను ప్రధాని, జాతీయ అసెంబ్లీ స్పీకర్ పదవులకు ఆమోదించారు.

షెహ్​బాజ్.. 2023 ఆగస్టు వరకు 16 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.

సంకీర్ణ అధికారం కొనసాగేనా?

పీఎంఎల్-ఎన్-పీపీపీ పొత్తు ఒప్పందంలో భాగంగా నవాజ్ షరీఫ్ (nawaz Sharif) కుమార్తె మరియం నవాజ్​ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. నవాజ్ రాజకీయ వారసురాలు మరియం సోమవారం ప్రమాణ స్వీకారం చేసి దేశంలోని ఓ ప్రావిన్స్​కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

పీపీపీ సీనియర్ నేత, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి అధ్యక్ష పదవి దక్కాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలిచారు?

* ఇమ్రాన్ ఖాన్​కు (Imran Khan Pakistan) చెందిన పీటీఐతో జతకట్టిన స్వతంత్ర అభ్యర్థులు 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు గాను 93 స్థానాలను కైవసం చేసుకున్నారు.

* నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ జాతీయ అసెంబ్లీలో 75 స్థానాల్లో విజయం సాధించింది.

* పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) జాతీయ అసెంబ్లీలో 54 స్థానాలు గెలుచుకుంది.

* దేశ విభజన సమయంలో భారత్ నుంచి వలస వచ్చిన ఉర్దూ మాట్లాడే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కరాచీకి చెందిన ముత్తహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ)కు 17 సీట్లు వచ్చాయి.

• అభ్యర్థి మృతి చెందడంతో ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడింది.

పాకిస్థాన్​ రాజ్యాంగం ప్రకారం అక్కడ 266 సీట్లు ఉన్నాయి. ఒక సీటులో ఎన్నిక జరగలేదు. ఫలితంగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 265 సీట్లల్లో కనీసం 133 చోట్ల గెలవాలి.

Whats_app_banner

సంబంధిత కథనం