1563 మంది అభ్యర్థుల నీట్ ఫలితాల రద్దుకు సుప్రీంకోర్టు అనుమతి-sc allows cancellation of neet results for 1563 candidates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  1563 మంది అభ్యర్థుల నీట్ ఫలితాల రద్దుకు సుప్రీంకోర్టు అనుమతి

1563 మంది అభ్యర్థుల నీట్ ఫలితాల రద్దుకు సుప్రీంకోర్టు అనుమతి

HT Telugu Desk HT Telugu
Jun 13, 2024 12:05 PM IST

గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థుల నీట్ యూజీ ఫలితాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

నీట్ పరీక్షలపై సుప్రీం విచారణ
నీట్ పరీక్షలపై సుప్రీం విచారణ

నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు, కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థుల ఫలితాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. వీరికి రీ ఎగ్జామినేషన్ నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

జూన్ 23న రీ టెస్ట్ నిర్వహించేందుకు, ఈ టెస్టుకు హాజరయ్యే 1563 మంది అభ్యర్థుల పాత స్కోర్ కార్డులను రద్దు చేసేందుకు ఎన్టీఏకు కోర్టు అనుమతి ఇచ్చింది. రీ ఎగ్జామినేషన్ కు కూర్చోవడానికి ఇష్టపడని అభ్యర్థులు గ్రేస్ మార్కులు లేకుండా వారి ఒరిజినల్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

జూన్ 30 లోపు రీ టెస్ట్ ఫలితాలను ప్రకటిస్తామని, జూలై 6న అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ఎన్టీఏ తెలిపింది.

నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిజిక్స్ వాలా సీఈఓ అలఖ్ పాండే ఈ పిటిషన్ దాఖలు చేశారు.

గత విచారణలో పరీక్ష నిర్వహణపై ప్రభావం పడిందని, దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

పేపర్ లీకేజీ ఆరోపణలను ఎన్టీఏ ఖండించింది. పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లలేదని పేర్కొంది. ఆరు కేంద్రాల్లోని అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని గ్రేస్ మార్కుల కేటాయింపును నిర్ణయించామని సంస్థ గత వారం విలేకరుల సమావేశంలో తెలిపింది. అయితే, తాము ఉపయోగించిన ఖచ్చితమైన ఫార్ములాను ఏజెన్సీ అందించలేదు.

Whats_app_banner

టాపిక్