Sab chor hai: Bihar minister viral comments: ‘అంతా దొంగలే.. నేను వారి నాయకుడిని’
‘Sab chor hai’: Bihar minister viral comments: బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాఖ అధికారులు, ఉద్యోగులు అంతా దొంగలేనని, తాను ఆ దొంగల నాయకుడినని వ్యాఖ్యానించారు.
‘Sab chor hai’: Bihar minister viral comments: ఒక బహిరంగ సభ వేదికపై నుంచి మంత్రి సుధాకర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. దీనిపై బిహార్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ దొంగల కామెంటే కాకుండా, అదే వేదికపై నుంచి ఆయన పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
‘Sab chor hai’: Bihar minister viral comments: దొంగల నాయకుడిని
బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ సొంత శాఖ అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన శాఖలో దొంగ కాని ఉద్యోగి ఒక్కరు కూడా లేరన్నారు. అలాంటి దొంగలకు మంత్రిగా తాను వారికి నాయకుడినయ్యానన్నారు. సబ్ చోర్ హై.. మై చోరోఁ కా సర్దార్` అంటూ ఆయన ప్రసంగిస్తున్న వీడియో వైరల్ అయింది.
‘Sab chor hai’: Bihar minister viral comments: విత్తనాల్లోనూ అవినీతే..
కైమూర్ లో జరిగిన ఒక బహిరంగ సభలో మంత్రి సుధాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అవినీతికి పాల్పడలేదని, కానీ తన మంత్రిత్వ శాఖలోని అధికారులంతా అవినీతిపరులేనని, అందువల్ల తాను వారికి నాయకుడిని అయ్యానని వివరించారు. ఈ అవినీతి బాగోతంలో తన పైన కూడా చాలామంది ఉన్నారన్నారు. ‘‘సీడ్ కార్పొరేషన్ అందించే విత్తనాలను ఏ రైతు వాడడు. ఆ విత్తనాల పేరుతో సీడ్ కార్పొరేషన్ రూ. 150 నుంచి రూ. 200 కోట్లు కొట్టేస్తుంది. అలా, నా శాఖలో అవినీతికి పాల్పడని విభాగమే లేదు. అవినీతిలో అన్ని విభాగాలు ఒక దానిని మించి మరొకటి’’ అని ఆరోపించారు.
‘Sab chor hai’: Bihar minister viral comments: నా దిష్టిబొమ్మలు తగలెట్టండి
రైతులకు ఆ వ్యవసాయ మంత్రి మరో సలహా కూడా ఇచ్చారు. తన దిష్టిబొమ్మలు తగలబెట్టాలని వారికి సూచించారు. ‘‘మీ కోపం నాకు తెలియాలి. అందుకే నా దిష్టిబొమ్మలు తగలబెట్టండి. అప్పుడే మీరు కోపంగా ఉన్నారని తెలుస్తుంది. లేదంటూ అంతా బాగానే ఉందనుకుంటా’’ అన్నారు .
‘Sab chor hai’: Bihar minister viral comments: అంతా సేమ్ టు సేమ్
కొత్తగా ఏర్పడిన సొంత ప్రభుత్వం పై కూడా ఈ ఆర్జేడీ మంత్రి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కానీ, పనితీరు అంతా గతంలో మాదిరిగానే సేమ్ టు సేమ్ అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి విడివడి, ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలిసి జేడీయూ నేత నితీశ్ కుమర్ బిహార్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.