RRB NTPC 2024 registration : 8వేలకుపైగా ఆర్​ఆర్బీ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..-rrb ntpc 2024 registration begins for graduate posts direct link notification ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rrb Ntpc 2024 Registration : 8వేలకుపైగా ఆర్​ఆర్బీ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

RRB NTPC 2024 registration : 8వేలకుపైగా ఆర్​ఆర్బీ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

Sharath Chitturi HT Telugu
Sep 15, 2024 06:48 AM IST

RRB NTPC 2024 registration : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. 8వేలకుపైగా ఖాళీలను ఈ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​లో భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 రిజిస్ట్రేషన్లు మొదలు..
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 రిజిస్ట్రేషన్లు మొదలు..

నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) కింద గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. సీఈఎన్ 05/2024 కింద ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024కు rrbapply.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 13ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 ఈ దఫా రిక్రూట్​మెంట్​లో గ్రాడ్యుయేట్ స్థాయిలోని 8113 ఖాళీలను భర్తీ చేస్తోంది.

అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి ఖాళీల కోసం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 (సీఈఎన్ 06/2024) 3,445 ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు యూజీ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు విండో: సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13, 2024

దరఖాస్తుల ముగింపు తర్వాత ఫీజు చెల్లింపు విండో: అక్టోబర్ 14- 15

దరఖాస్తు ఫారం కరెక్షన్ విండో: అక్టోబర్ 16 నుంచి 25 వరకు

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024: ఖాళీల వివరాలు

గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఖాళీలు

చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 1,736

స్టేషన్ మాస్టర్: 994 ఖాళీలు

గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3,144

జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1,507 ఖాళీలు

సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 1,507 ఖాళీలు

సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 7323

మొత్తం- 8,113

అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఖాళీలు:

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 ఖాళీలు

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 ఖాళీలు

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990

ట్రైన్స్​ క్లర్క్: 72 ఖాళీలు

మొత్తం: 3,445

ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వనున్నారు.

పోస్టుల వారీగా అర్హతలు, ఇతర వివరాల తెలుసుకునేందుకు నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులు, ట్రాన్స్​జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) అభ్యర్థులకు రూ.250. మిగతా వారికి దరఖాస్తు ఫీజు రూ.500.

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కి హాజరైతే బ్యాంకు ఛార్జీల తగ్గింపు తర్వాత దరఖాస్తు ఫీజును పాక్షికంగా రీఫండ్ చేయడానికి అర్హులు.

సంబంధిత కథనం