Priyanka Gandhi : 2024 లోక్​సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ!-robert vadra hints at priyanka gandhis bid for lok sabha seat in 2024 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Priyanka Gandhi : 2024 లోక్​సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ!

Priyanka Gandhi : 2024 లోక్​సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ!

HT News Desk HT Telugu
Aug 13, 2023 05:30 PM IST

Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. 2024 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఈ విషయంపై ఆమె భర్త రాబర్ట్​ వాద్రా ఏమన్నారంటే..

2024 లోక్​సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ!
2024 లోక్​సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ!

Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ.. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​కు ప్రచారాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ఉత్తర్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బాధ్యతలను తన భూజాల మీద వేసుకుని, నేతలను ముందుండి నడిపించారు. అయితే ఇప్పటివరకు ఆమె ఒక్కసారి కూడా ఎన్నికల క్షేత్రంలోకి దిగలేదు. ఇక 2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రియాంక గాంధీ ఎన్నికల ఎంట్రీపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై ఆమె భర్త రాబర్ట్​ వాద్రా గాంధీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా?

ఉత్తర్​ ప్రదేశ్​ రాయ్​బరేలీ, అమేఠీ ప్రాంతాల్లో ప్రియాంక గాంధీ చాలా ఏళ్లుగా క్రియాశీలకంగా ఉంటున్నారు. కాగా.. 2022 ఉత్తర్​ ప్రదేశ్​ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగుతారని వార్తలు జోరుగా సాగాయి. అంతేకాకుండా.. ప్రియాంక గాంధీనే కాంగ్రెస్​ సీఎం అభ్యర్థి అని జోరుగా ప్రచారాలు జరిగాయి. కానీ వాస్తవానికి ఇవేవీ జరగలేదు. ఆమె ఇంకా ఎన్నికల బరిలో దిగలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై రాబర్ట్​ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

Priyanka Gandhi latest news : "ప్రియాంక గాంధీ కచ్చితంగా లోక్​సభలో ఉండాలి. లోక్​సభలో ఉండేందుకు కావాల్సిన అర్హత ఆమెకు ఉంది. పార్లమెంట్​లో ఆమె చాలా బాగా ఉంటుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్​ గుర్తిస్తుందని, ఆమె నుంచి పార్టీ ఇంకా ప్రయోజనాలు పొందుతుందని భావిస్తున్నాను," అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్​ వాద్రా అన్నారు.

ఇదీ చూడండి:- Priyanka Gandhi: ప్రియాంక గాంధీపై పోలీస్ కేసు; ఆ ఆరోపణలు చేసినందుకే..

ఈ క్రమంలో అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రియాంక గాంధీ భర్త.

"గౌతమ్​ అదానీతో నాకు సంబంధం ఉందని స్మృతి ఇరానీ ఆరోపిస్తున్నారు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. కానీ పేరు వస్తే మాత్రమే, పోరాడుతాను. గౌతమ్​ అదానీతో కలిసి నేను చేసిన ఒక్క పనినైనా చూపించండి. లేకపోతే క్షమాపణలు చెప్పాల్సిందే. గౌతమ్​ అదానీతో విమానంలో ప్రయాణించిన మోదీ ఫొటో అందరి దగ్గర ఉంది. మరి దానిపై మేము ఎందుకు ప్రశ్నించకూడదు? రాహుల్​ గాంధీ ప్రశ్నించినా సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు?" అని ప్రశ్నించారు రాబర్ట్​ వాద్రా.

ప్రియాంకను కాంగ్రెస్​ బరిలో దింపుతుందా?

2024 Lok Sabha election Congress : రాయ్​బరేలీ, అమేఠీలు కాంగ్రెస్​కు కంచుకోటలుగా వస్తూ ఉన్నాయి. కానీ 2019 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. తన అమేఠీ సీటును స్మృతి ఇరానీకి కోల్పోయారు. ఇక రాయ్​బరేలీలో సోనియా గాంధీ ఎంపీగా దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీ.. ప్రముఖ నేతగా ఎదిగారన్న విషయం వాస్తవమే. అంతేకాకుండా.. ఉత్తర్​ ప్రదేశ్​ ఎన్నికల సమయంలో ఆమె ప్రణాళికలకు, పార్టీని ముందిండి నడిపించిన తీరుకు ప్రశంసలు కూడా అందాయి. మరి కాంగ్రెస్​ పార్టీ ఆమెను బరిలో దింపుతుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. 2024 సార్వత్రికం వరకు ఎదురు చూడాల్సిందే!

IPL_Entry_Point

సంబంధిత కథనం