6 babies in one delivery : పాకిస్థాన్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది! రావల్పిండిలో ఓ మహిళ.. ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ ఆరుగురులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరందరి బరువు.. 2 పౌండ్ల కన్నా తక్కువగా ఉంది. తల్లీబిడ్డలు అందరు ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.
ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ పేరు జీనత్ వహీద్. ఆమె భర్త పేరు మహమ్మద్ హవీద్. పురుటి నొప్పులతో జీనత్ హవీద్.. గురువారం రాత్రి రావల్పిండిలోని జిల్లా ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం ఆమె.. బిడ్డలకు జన్మనిచ్చింది. గంటలోపే.. ఆమె మొత్తం ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది హవీద్.
"మహిళతో పాటు ఆమె ఆరుగురు బిడ్డలు సురక్షితంగా ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిదని.. బిడ్డలను ఇన్క్యూబేటర్లో పెట్టారు వైద్యులు," అని డా. ఫర్జానా తెలిపారు.
6 babies in one delivery in Pakistan : అయితే.. డెలవరీ తర్వాత జీనత్‌కు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చాయని, రెండు-మూడు రోజుల్లో అవి తగ్గిపోతాయని డాక్టర్ చెప్పారు.
"ఆరుగురులో.. మొదట ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. మూడో బిడ్డ ఆడబిడ్డ. ఇది నార్మల్ డెలివరీ కాదు," అని హాస్పిటల్‌లోని డ్యూటీ ఆఫీసర్ తెలిపారు.
మరోవైపు.. ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ కుటుంబం సభ్యులు సంతోషంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వారి ఆనందాన్ని వెల్లడించారు.
Woman gives birth to 6 babies at once : ఇలా ఆరుగురు బిడ్డలు ఒకే కాన్పులో పుట్టడం చాలా అరుదైన విషయం. ఎంత అరుదంటే.. కేవలం 4.5 మిలియన్ కేసుల్లో ఒకటి ఇలా ఉంటుంది. పైగా.. ఇంత మంది బిడ్డలు పుడితే, వారు బతకడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది.
ఒక కాన్పులో ఒకరు పుట్టడం సాధారణం. ఇద్దరు పుడితే ట్విన్స్ అంటారు. కానీ ఒక్కోసారి.. ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పుట్టడం చాలా అరుదు. అలాంటిది.. పాకిస్థాన్‌కు చెందిన ఆ మహిళ.. ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.
సంబంధిత కథనం