Man rapes daughter for 24 years : కూతురిపై 1000సార్లు రేప్- ఆమెతో ఏడుగురు బిడ్డలకు తండ్రి అయ్యాడు!
Josef Fritzl case : ఆస్ట్రియాలో కూతురిని బంధించి.. 24ఏళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డ జోసెఫ్ ఫ్రిట్జల్ కేసు మరోమారు వార్తలకెక్కింది. అతడి పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Josef Fritzl basement : ఆస్ట్రియాలో దశాబ్ద కాలం క్రితం సంచలనం సృష్టించిన జోసెఫ్ ఫ్రిట్జల్ కేసు మరోమారు వార్తల్లో నిలిచింది. తన కూతురుని బంధీగా ఉంచి, 24ఏళ్ల పాటు 1000కిపైగాసార్లు రేప్ చేసి, ఏడుగురు బిడ్డలకు తండ్రి అయిన జోసెఫ్ ఫ్రిట్జల్ కేసుపై అక్కడి కోర్టు తాజాగా ఓ తీర్పునివ్వడం ఇందుకు కారణం.
జోసెఫ్ ఫ్రిట్జల్ కేసు..
ఉత్తర ఆస్ట్రియాలోని ఓ పట్టణంలో నివాసముండేవాడు జోసెఫ్ ఫ్రిట్జల్. 1984లో తన ఇంటి బేస్మెంట్లో ఓ సౌండ్ ప్రూఫ్ గదిని నిర్మించాడు. గది సిద్ధమైన తర్వాత.. తన 18ఏళ్ల కుమార్తెను అందులో బంధించాడు. 24ఏళ్ల పాటు అక్కడే, ఆమెపై అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడుగురు బిడ్డలకు తండ్రి అయ్యాడు. వారిలో ఒకరు మరణించారు.
కూతురు కనిపించకపోతే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని జోసెఫ్‌కి తెలుసు. అందుకు తగ్గట్టుగానే ఓ ప్లాన్ వేశాడు. అనుకున్నట్టే.. కుటుంబసభ్యులు.. పోలీసుల వద్దకు వెళ్లి, మిస్సింగ్ కేసు పెట్టారు. నెల రోజుల తర్వాత.. జోసెఫ్ ఫ్రిట్జల్ పోలీసుల వద్దకు వెళ్లాడు. తన ఇంట్లో ఓ లెటర్ దొరికిందని ఇచ్చాడు.
'నా కుటుంబంతో నేను కలిసి ఉండలేను. నా గురించి ఎవరు వెతకకండి. దేశాన్ని వదిలేస్తున్నా,' అని ఆ లెటర్లో రాసి ఉంది. వాస్తవానికి.. తన కూతురు చేత, బలంవంతంగా ఆ లెటర్ రాయించాడు జోసెఫ్ ఫ్రిట్జల్. ఆ తర్వాత, అనేకమార్లు లెటర్లు రాయించి, తన మీద అనుమానం రానివ్వకుండా చేశాడు.
Man rapes daughter for 24 years : అదే సమయంలో.. ఆమెను రేప్ చేయడం మొదలుపెట్టాడు. పిల్లలను కనడం మొదలుపెట్టాడు. తొలుత ఒక పసికందు మరణించింది. మరో ముగ్గురు బిడ్డలు పుట్టిన తర్వాత.. వారిని తన భార్య దగ్గరికి తీసుకెళ్లి పెంచుకుందామని చెప్పాడు. నాలుగో బిడ్డ పుట్టేసరికి.. కూతురు ఉన్న గదిని ఎక్స్‌ప్యాండ్ చేశాడు. కూతురు, ఆమె పిల్లల చేత మట్టిని చేతులతో తవ్వించాడు. టీవ, రేడియో, వీడియోకాసెట్ ప్లేయర్, ఫ్రిడ్జ్ వంటివి బేస్మెంట్లోని ఆ గదిలోనే సమకూర్చాడు. గది చుట్టూ ప్రమాదకరమైన గ్యాస్ ఉందని, బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తే.. చనిపోతారని వారందరికి చెప్పాడు. కానీ అది నిజం కాదని తర్వాత తేలింది.
పైన ఉన్న భార్యకు, కుటుంబసభ్యులకు ఇవేమీ తెలియలేదు. మేన్యుఫ్యాక్చరింగ్ సంస్థలో పనిచేసే జోసెఫ్ ఫ్రిట్జల్.. ఆ గది తన పని కోసం వాడుకుంటున్నాడని భావించారు. గది దగ్గరికి ఎవరు వెళ్లొద్దని అనేకమార్లు హెచ్చరించాడు.
Josef Fritzl case latest updates : బేస్మెంట్లోని ఆ గది పక్కనే ఓ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో రెంట్‌కి ఉండే వారు.. ఏవో అరుపులు వినిపిస్తున్నాయని చెప్పేవారు. గ్యాస్ హీటింగ్ సిస్టెమ్లో సమస్య ఉందని, పైప్స్ బాలేవని చెప్పి నచ్చజెప్పేవాడు జోసెఫ్ ఫ్రిట్జల్.
ఇలా.. 2008 వరకు గడిచింది. ఓసారి బేస్మెంట్ నుంచి జోసెఫ్ ఫ్రిట్జల్ కూతురు అనూహ్యంగా బయటకు వచ్చింది. తనకు జరిగినది వివరించింది. అప్పుడే.. జోసెఫ్ ఫ్రిట్జల్ నేరాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. జోసెఫ్ ఫ్రిట్జల్ని 'మాన్స్టర్ ఆఫ్ అమ్స్టెట్టెన్' అని పిలవడం మొదలుపెట్టారు. అతనిపై కిడ్నాప్, రేప్‌తో పాటు అనేక కేసులు నమోదయ్యాయి. చివరికి.. అతనికి జీవిత ఖైదు శిక్షపడింది.
జోసెఫ్ ఫ్రిట్జల్ కేసులో కోర్టు తాజా తీర్పు..
జీవిత ఖైదుతో పాటు జోసెఫ్ ఫ్రిట్జల్ని సైకియాట్రిక్ డిటెన్షన్ కేంద్రానికి పంపించారు. అక్కడ అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అతని వయస్సు 88ఏళ్లు. తనకు డిమెన్షియా ఉందని, తనకు విముక్తి కల్పించాలంటూ కొన్ని రోజుల క్రితం పిటిషన్ వేశాడు జోసెఫ్ ఫ్రిట్జల్. మంగళవారం నాడు కోర్టు విచారించింది. ఫ్రిట్జల్ని సైకియాట్రిక్ డిటెన్షన్ నుంచి సాధారణ జైలుకు మార్చవచ్చని పేర్కొంది.
Josef Fritzl news : "జోసెఫ్ ఫ్రిట్జల్ ఇక డేంజరెస్ కాదని కోర్టు అంగీకరించింది. విచారణ సమయంలో ఆయన కంటతడి పెట్టుకున్నాడు. బాధితులకు క్షమాపణలు చెప్పాడు. తన దగ్గర శక్తి ఉంటే.. జరిగినది మార్చేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు," అని జోసెఫ్ ఫ్రిట్జల్ తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు.
అయితే.. జోసెఫ్ ఫ్రిట్జల్ని సైకియాట్రిక్ డిటెన్ష్ నుంచి సాధారణ జైలుకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ.. అవసరమైతే ప్రాసిక్యూషన్ మరో పిటిషన్ వేయవచ్చు. ఇందుకోసం తీర్పు వెలువడిన సమయం నుంచి 14 రోజుల సమయం ఉంది.
సంబంధిత కథనం