Punjab gangster killed in Canada: కెనడాలో గ్యాంగ్ వార్; పంజాబీ గ్యాంగ్ స్టర్ హత్య
కెనడాలో జరిగిన ఒక గ్యాంగ్ వార్ లో పంజాబ్ కు చెందిన ఒక గ్యాంగ్ స్టర్ చనిపోయాడు. సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా అనే గ్యాంగ్ స్టర్ ఆ కాల్పుల్లో మరణించాడు.
ప్రతీకాత్మక చిత్రం
దావిందర్ బాంబిహా గ్యాంగ్ కు చెందిన సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె బుధవారం రాత్రి కెనడాలో జరిగిన ఒక గ్యాంగ్ వార్ లో చనిపోయాడు. సుఖ్దూల్ సింగ్ పంజాబ్ లోని మొగా జిల్లాకు చెందిన వాడు.
నిజ్జర్ హత్య తరహాలోనే..
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కూడా కెనడాలో జూన్ 18న ఇలాగే గ్యాంగ్ వార్ లో చనిపోయాడు. నిజ్జర్ పై దుండగులు 15 రౌండ్ల కాల్పులు జరిపారు. సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె 2017 లో భారత్ నుంచి కెనడా పారిపోయాడు. అతడిపై భారత్ లో చాలా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం పంజాబ్ లోని దాదాపు 30 మంది గ్యాంగ్ స్టర్లు భారత్ వెలుపల, ముఖ్యంగా కెనడాాలో ఆశ్రయం పొందుతున్నారు. నకిలీ ధృవపత్రాల ద్వారా కానీ, ఫోర్జరీ చేసిన ట్రావెల్ డాక్యుమెంట్స్ తో నేపాల్ నుంచి కానీ వారు కెనడా చేరుకున్నారు.