Khalistan : జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో గోడలపై 'ఖలిస్తాన్ జిందాబాద్' రాతలు!
Pro-Khalistan slogans in Delhi : దిల్లీలోని అనేక మెట్రో స్టేషన్స్‌లో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు వెలిశాయి. అధికారులు.. వీటిని తొలగించారు.
Pro-Khalistan slogans in Delhi : జీ20 సదస్సు కోసం దిల్లీ సన్నద్ధమవుతున్న వేళ.. అనేక మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్తాన్ అనూకల రాతలు కనిపించాయి. ఇవి అధికారులను ఒకింత కలవరపాటుకు గురిచేశాయి.
"దిల్లీ బనేగా ఖలిస్తాన్", "ఖలిస్తాన్ రిఫరాండం జిందాబాద్" వంటి నినాదాలు.. పశ్చిమ దిల్లీలోని పంజాబీ బాఘ్, శివాజి పార్క్, మదీపుర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ నగర్, మహారాజ సురాజ్మాల్ స్టేడియం మెట్రో స్టేషషన్ గోడలపై వెలిశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నాటికి వీటిని తొలగించారు.
Delhi metro stations : పోలీసుల ప్రకారం.. నిషేధిత ఎస్ఎఫ్జే (సిఖ్ ఫర్ జస్టిస్) కార్యకర్తలు.. అనేక మెట్రో స్టేషన్లలో ఖలిస్తాన్ అనూకలంగా నినాదాలు రాశారు. నంగ్లోయ్‌లోని ప్రభుత్వ సర్వోదయ బాల్ విద్యాలయ గోడలపైనా రాతలు వెలిశాయి.
ఇదీ చూడండి:- లండన్, కెనడాలలో ఖలిస్తానీ పోస్టర్లు.. ‘కిల్ ఇండియా’ పేరిట ర్యాలీకి రెడీ..!
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఖలిస్తాన్ రిఫరాండం..
G20 summit 2023 India : దిల్లీ మెట్రో స్టేషన్స్ గోడలపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలకు సంబంధించిన వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసింది ఎస్ఎఫ్జే. ఖలిస్తాన్ డిమాండ్‌కు అనుకూలంగా నినాదాలు చేసింది. దిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జీ20 సదస్సు జరుగుతుండగా.. 10వ తేదీన కెనడాలో ఖలిస్తాన్ రిఫరాండం (ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ) చేపడతామని ఎస్ఎఫ్జీ చీఫ్ గుర్పత్వాన్ సింగ్ పన్ను వీడియోలో తెలిపారు.
సంబంధిత కథనం