Preeti Sudan : యూపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్ నియామకం..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్‌పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదాన్ నియమితులయ్యారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్‌పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ఆగస్టు 1వ తేదీ, గురువారం ఆమె ఈ పదవిని చేపట్టనున్నారని సమాచారం.
వ్యక్తిగత కారణాలతో యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామా చేయగా.. ఆయన స్థానాన్ని ప్రీతి భర్తీ చేయనున్నారు.
ఎవరు ఈ ప్రీతి సుదాన్..?
ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు యూపీఎస్ఏసీలో సభ్యురాలిగా ఉండేవారు.
ప్రీతి సుదాన్కు లండ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్‌తో పాటు సోషల్ పాలసీ, ప్లానింగ్‌లో డిగ్రీ ఉంది. వాషింగ్టన్లో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ శిక్షణ తీసుకున్నారు. ఆమెకు ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్, సోషల్ పాలిసీ- ప్లానింగ్‌లో ఎంఎస్సీ డిగ్రీలు కూడా ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరిగా రిటైర్ అవ్వకముందు కొవిడ్-19 సంక్షోభాన్ని ప్రీతి సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దాని కన్నా ముందు ప్రజా ఆహార పంపిణీ విభాగానికి సెక్రటరీగా పనిచేశారు. శిశు-మహిళాభివృద్ధి, రక్షణశాఖలో కూడా ఆమె సేవలందించారు. స్టేట్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, విపత్తు నిర్వహణ, పర్యటన, వ్యవసాయ విభాగాల్లోనూ పని చేసిన అనుభవం ఆమె సొంతం.
జాతీయస్థాయి కార్యక్రమాల్లో ప్రీతి సుదాన్ చాలా కీలక పాత్ర పోషించారు. బేటీ బచావ్-బేటీ పడావ్, ఆయుష్మాన్ భారత్‌కు సంబంధించి ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. నేషనల్ మెడికల్ కమిషన్‌పై చట్టం, ఈ-సిగరెట్లపై నిషేధం వంటివి ఆమె చేపట్టిన ఇంకొన్ని ముఖ్యమైన పనులు.
వీటితో పాటు వరల్డ్ బ్యాంక్‌కి కూడా ప్రీతి సుదాన్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. సీఓపీ-8 ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్‌కి ఛైర్‌పర్సన్‌గాను పనిచేశారు. పసికందు- శిశు ఆరోగ్య విభాగానికి వైస్-ఛైర్పర్సన్ అయ్యారు. డబ్ల్యూహెచ్ఓకి చెందిన సంక్షోభ నిర్వహణ, స్పందన ప్యానెల్లో సభ్యురాలు ప్రీతి సుదాన్. గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్‌నర్‌షిప్‌కి ఆమె ఛైర్పర్సన్.
2022 నవంబర్ 29న ప్రీతి సుదాన్ యూపీఎస్సీలో సభ్యురాలిగా చేరారు. అంటే దాదాపు అన్ని ప్రధాన రంగాల్లో పనిచేసిన అనుభవం, అపార జ్ఞానం ప్రీతి సుదాన్ సొంతం.
సంబంధిత కథనం