PM Modi bats for regional languages: ప్రాంతీయ భాషలకు ప్రధాని మోదీ మద్దతు-poorest of poor should understand pm modi bats for laws to be written in simple regional languages ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Bats For Regional Languages: ప్రాంతీయ భాషలకు ప్రధాని మోదీ మద్దతు

PM Modi bats for regional languages: ప్రాంతీయ భాషలకు ప్రధాని మోదీ మద్దతు

HT Telugu Desk HT Telugu
Oct 15, 2022 08:19 PM IST

PM Modi bats for regional languages: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాంతీయ భాషలకు అనుకూలంగా మాట్లాడారు. దేశంలో చట్టాలు అత్యంత పేదలకు కూడా అర్థం కావాలంటే వాటిని సులభమైన భాషలో, అన్ని ప్రాంతీయ భాషల్లో రాయాలని సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో) (ANI)

కఠిన పదాలతో, అర్థం కాని భాషల్లో చట్టాలు ఉండడం వల్ల అవి సామాన్యులు అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రాంతీయ భాషల్లో కూడా చట్టాలను రూపొందించాలన్నారు.

PM Modi bats for regional languages: సులభంగా, సొంత భాషలో..

సామాన్యులకు, పేదల్లోకెల్లా అత్యంత పేదవారికి కూడా చట్టాలు అర్థం కావాలంటే వాటిని సులభమైన భాషలో రాయాల్సి ఉందని, అలాగే అన్ని ప్రాంతీయ భాషల్లో వాటిని రూపొందించాల్సి ఉందని ప్రధాని మోదీ సూచించారు. ఆల్ ఇండియా కాన్ఫెరెన్స్ ఆఫ్ లా మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ లో శనివారం ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వర్చువల్ గా ఇచ్చిన ప్రసంగంలో కాలం తీరిన దాదాపు 15 వందల చట్టాలను రద్దు చేశామని, వలస పాలన నాటి గుర్తులను వరుసగా తొలగిస్తున్నామని వివరించారు.

PM Modi bats for regional languages: లోక్ అదాలత్ లు..

ప్రజలకు సత్వర న్యాయం అందడం కోసం లోక్ అదాలత్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఇవి సమర్ధవంతంగా పని చేస్తున్నాయన్నారు. అంతర్గత సంస్కరణలను కొనసాగిస్తూనే, అభివృద్ధి లో దూసుకుపోతున్నామన్నారు. సామాన్యుడు చట్టాలను అర్థం చేసుకోవడానికి భాష అడ్డం కాకూడదని ప్రధాని సూచించారు. చట్టాలను రూపొందించే సమయంలోనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

IPL_Entry_Point

టాపిక్