PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!-pm narendra modi in bihar will make pakistan wear bangles if ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

Sharath Chitturi HT Telugu
May 13, 2024 02:38 PM IST

Lok Sabha elections : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి. విపక్ష ఇండియా కూటమి నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

బిహార్​ సభలో ప్రధాని మోదీ..
బిహార్​ సభలో ప్రధాని మోదీ.. (PTI)

PM Modi on Pakistan : 2024 లోక్​సభ ఎన్నికల్లో ప్రచారాల జోరును పెంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పాకిస్థాన్​పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్​గా మారాయి. బిహార్​లో జరిగిన ఓ బహిరంగ సభలో.. 'నేను పాకిస్థాన్​కి గాజులు తొడుగుతాను,' అని ఆయన అన్నారు.

'పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతాను..'

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో.. పాకిస్థాన్​పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. పీఓకే (పాక్​ ఆక్రమిత కశ్మీర్​)ని భారత్​లో కలుపుకుంటామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఫరూక్​ అబ్దుల్లా మండిపడ్డారు. 'పొరుగు దేశం గాజులు వేసుకుని కూర్చోలేదు. వాళ్ల దగ్గర ఆటమ్​ బాంబ్​ ఉంది. అది ఇండియాకు హాని చేయొచ్చు,' అన్నారు.

ఇక బిహార్​ల జరిగిన బహిరంగ సభలో.. ఫరూక్​ అబ్దుల్లా వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు చేశారు మోదీ. అదే సమయంలో పాకిస్థాన్​ ఆర్థిక కష్టాలను లేవనెత్తారు.

PM Modi Lok Sabha elections : "పాకిస్థాన్​ ఇంకా గాజులు వేసుకోకపోతే.. నేను గాజులు తొడుగుతాను. వాళ్ల దగ్గర విద్యుత్​ లేదు. తిండి లేదు. వాళ్లకి ఇప్పుడు గాజుల కొరత కూడా ఉందని నాకు తెలిసింది," అని ముజాఫర్​లో జరిగిన సభలో వ్యాఖ్యానించారు.

మరోవైపు.. 'పాకిస్థాన్ దగ్గర ఆటమ్​ బాంబు ఉంది. మనం ఆ దేశాన్ని గౌరవించండి,' అని కాంగ్రెస్​ నేత మణి శంకర్​ అయ్యర్​ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీనిపైనా మోదీ కొన్ని రోజుల క్రితం స్పందించారు.

"దేశ ప్రజలను కాంగ్రెస్​ నాశనం చేస్తోంది. లాంటి బలహీన మనస్థత్వం వల్లే సీమాంతర ఉగ్రవాదం గతంలో ఎక్కువగా ఉండేది. ఇక పాకిస్థాన్​ విషయానికొస్తే.. తాము తయారు చేసిన బాంబులను అమ్మడానికి ఆ దేశం చాలా ప్రయత్నిస్తోంది. కానీ నాణ్యత సరిగ్గా లేకపోవడంతో కొనేవారే లేరు!" అని మోదీ అన్నారు.

విపక్ష ఇండియా కూటమిపైనా విరుచుకుపడ్డారు మోదీ.

2024 Lok Sabha elections : "బిహార్​ ప్రజల కన్నా.. ఆర్​జేడీ- కాంగ్రెస్​కి ఓటు బ్యాంకు సంక్షేమమే ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన కోసం ఆర్​జేడీ ప్రయత్నిస్తోంది," అని మోదీ అన్నారు.

ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న లాలూ ప్రసాద్​ యాదవ్​ మాటలను తిప్పికొడుతూ.. 'దళితుల రిజర్వేషన్లను దోచుకోవడానికి ఆర్​జేడీ, కాంగ్రెస్​ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి' అని మోదీ అన్నారు.

2024 లోక్​సభ ఎన్నికల 4వ దశ పోలింగ్​ ప్రస్తుతం నడుస్తోంది. మొత్తం 7 దశలో పోలింగ్​ తర్వాత.. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి. మూడోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. మోదీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్​, ఇండియా కూటమి కృషి చేస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం