ఐరాస సెక్రటరీ జనరల్‌తో ప్రధాన మంత్రి భేటీ
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో భేటీ అయ్యారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్‌తో ప్రధాన మంత్రి మోదీ (PTI)
కెవాడియా: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లోని కెవాడియాలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
బుధవారం నుంచి మూడు రోజుల భారత్ పర్యటనలో ఉన్న గుటెర్రెస్‌తో మోదీ సుదీర్ఘంగా సంభాషించారని అధికారులు తెలిపారు.
ప్రధాన మంత్రి మోడీ, ఐరాస చీఫ్ పర్యావరణ జీవనశైలి మిషన్ ప్రారంభించనున్నారు. ఇది సుస్థిరత వైపు ప్రజల సామూహిక విధానాన్ని మార్చే లక్ష్యంతో పనిచేస్తుంది.
దేశంలో మొట్టమొదటి 24 గంటలు సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ఇటీవల ప్రకటించిన మొధేరాను కూడా గుటెర్రెస్ సందర్శిస్తారు. గ్రామంలోని మహిళలతో సంభాషిస్తారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఉన్న మోధేరాలో అతి పురాతనమైన సూర్య దేవాలయం కూడా ఉంది.