Parliament security breach: ‘‘ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నారా?’’; పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటనలో వెలుగులోకి కీలక అంశాలు..-parliament breach accused wanted to immolate self police reveal fresh details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Parliament Security Breach: ‘‘ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నారా?’’; పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటనలో వెలుగులోకి కీలక అంశాలు..

Parliament security breach: ‘‘ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నారా?’’; పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటనలో వెలుగులోకి కీలక అంశాలు..

HT Telugu Desk HT Telugu
Dec 16, 2023 01:58 PM IST

Parliament security breach: పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక దశలో నిందితులు ఆత్మాహుతి చేసుకోవాలని కూడా ఆలోచించారని వెల్లడైంది.

పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనలో నిందితులు
పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనలో నిందితులు

Parliament security breach: లోక్ సభ జరుగుతుండగా, జీరో అవర్ లో ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి మనోరంజన్, సాగర్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా సభలోకి దూకి, టేబుల్స్ పై నుంచి దూకుతూ, చేతిలోని స్మోక్ గన్స్ నుంచి పసుపు రంగు పొగను వెదజల్లుతూ, స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పార్లమెంటు వెలుపల నీలమ్ దేవీ, అమోల్ షిండ్ అనే ఇద్దరు పసుపు రంగు పొగను వెదజల్లే స్మోక్ క్యాన్స్ తో నిరసన ప్రదర్శన జరిపారు. ఈ నలుగురితో పాటు వారికి సహకరించిన లలిత్ మోహన్ ఝా ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో కీలక అంశాలు..

ప్రభుత్వ నిరంకుశత్వం, మణిపూర్ హింస, వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాల అమలు, నిరుద్యోగం తదితరాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం (Parliament breach) చేపట్టామని పోలీసుల విచారణలో వారు తెలిపారు. ప్రేక్షకుల గ్యాలరీ లో నుంచి లోక్ సభలోనికి దూకి నిరసన తెలపాలన్న ఆలోచన కన్నా ముందు.. మరికొన్ని నిరసన మార్గాల గురించి ఆలోచించామని వెల్లడించారు. ఆత్మాహుతి చేసుకోవాలన్న ఆలోచన కూడా చేశామన్నారు. శరీరానికి మంట అంటుకోకుండా శరీరమంతా ఫైర్ ప్రూఫ్ జెల్ పూసుకుని, తమను తాము తగలబెట్టుకోవాలన్న ఆలోచన కూడా చేశామన్నారు. అదే విధంగా, సభలో కరపత్రాలు విసరాలన్న ప్రతిపాదనపై కూడా చర్చించామన్నారు. లోక్ సభలోనికి మొత్తం 7 స్మోక్ కానిస్టర్స్ ను తీసుకువెళ్లామన్నారు.

ఎంపీ విచారణ..

పార్లమెంటులోనికి వెళ్లడానికి పాస్ లు అరెంజ్ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప సింహను విచారించనున్నారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన స్పెషల్ సెల్ ఈ కేసును విచారిస్తోంది. ప్రభుత్వ నిరంకుశత్వం, మణిపూర్ హింస, వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాల అమలు, నిరుద్యోగం.. తదితర అంశాలపై తమ నిరసన తెలిపే ఉద్దేశంతో ఈ పని చేశామని నిందితులు తెలిపారు. తమ వెనుక ఏ సంస్థ లేదన్నారు. నిందితులను దర్యాప్తు అధికారులు ఢిల్లీలో ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడికి వెళ్లారు? అనే అంశాలు సహా కూలంకశంగా ప్రశ్నిస్తున్నారు. పార్లమెంటులో సీన్ రీ క్రియేషన్ కోసం పార్లమెంటు అధికారుల అనుమతిని కూడా కోరారు.

Whats_app_banner