Moonlighting: సెకండ్ జాబ్ చేయడం నైతికమే.. 64 శాతం ఓటు-over 64 percent consider moonlighting an ethical practice mint poll reveals ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Moonlighting: సెకండ్ జాబ్ చేయడం నైతికమే.. 64 శాతం ఓటు

Moonlighting: సెకండ్ జాబ్ చేయడం నైతికమే.. 64 శాతం ఓటు

Praveen Kumar Lenkala HT Telugu
Sep 01, 2022 12:08 PM IST

Moonlighting: మూన్‌లైటింగ్ అంటే.. ఒక ఉద్యోగం చేస్తుండగా.. వేరొక చోట ఖాళీ సమయంలో సైడ్ జాబ్ లేదా పార్ట్ టైమ్ జాబ్ చేయడం. ఇలా చేయడం నైతికమా అనే అంశంపై ‘మింట్’ పోల్ నిర్వహించింది.

<p>మూన్‌లైటింగ్ నైతికమా? అనైతికమా?</p>
మూన్‌లైటింగ్ నైతికమా? అనైతికమా? (Bloomberg)

Moonlighting: మూన్‌లైటింగ్‌కు మెజారిటీ ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు ‘మింట్’ పోల్ ద్వారా స్పష్టమైంది. ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ, ఆ సంస్థకు తెలియకుండా మరోచోట సైడ్ జాబ్ లేదా పార్ట్ టైమ్ జాబ్ లేదా ఫ్రీలాన్సింగ్ చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు.

ఉద్యోగ వేళలు పూర్తయ్యాక, లేదా వీకెండ్స్‌లో పార్ట్ టైమ్ వర్క్ చేయడాన్ని ‘మూన్ లైటింగ్’ అంటారు. అమెరికన్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే పనికి అదనంగా, అదనపు ఆదాయం కోసం ఇలాంటి పనులు చేసే వారు. అలా క్రమంగా దీనికి మూన్‌లైటింగ్ అనే పేరు స్థిరపడింది.

దీనిపై మింట్ బిజినెస్ న్యూస్ సంస్థ పోల్ నిర్వహించగా 64 మంది ఇది నైతికమేనని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 23.5 శాతం మంది మాత్రం ఇది అనైతికమని చెప్పారు. 12 శాతం మంది నైతికమా? అనైతికమా తేల్చలేకపోయారు.

ట్విటర్ యూజర్లు దీనిపై డిస్కస్ చేశారు. వారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. యూజర్లలో ఒకరు ఇలా రాశారు ‘అది మోసం చేయడం కాదు. 10 వేల వేతనం ఇచ్చి 1000 కోట్లు సంపాదిస్తారు చూడండి. అది చీటింగ్.. అది చీటింగ్..’ అని కామెంట్ చేశారు.

మరొక యూజర్ ఇలా స్పందించారు. ‘నైతికం ఎందుకు కాదు? మన రాజకీయ నాయకులు ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటారు. అట్లాగే వందలాది విభిన్న వ్యాపారాలు చేస్తారు. క్రికెటర్లు కామెంటరీ చేస్తారు. వాణిజ్య ప్రకటనలు చేస్తారు. క్లబ్స్ నిర్వహిస్తారు. ఫిల్మ్ సెలబ్రిటీస్ మూవీస్ తీస్తారు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తారు. వారికి వ్యాపారాలు కూడా ఉన్నాయి..’ అని స్పందించారు.

‘మంచి వ్యాపారానికి విధేయత, ఆలోచనాత్మకత, నిజాయతీ అనే మూడు అంశాలు ప్రాథమిక సూత్రాలు. వీటిని ఇరుపక్షాలూ గౌరవించాలి..’ అని మరొకరు రాశారు.

మరొక యూజర్ ఇలా రాశారు.. ‘ఇవన్నీ ఆపేయండి. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కంపెనీలు వీటిని స్వాగతించాలి. ఉద్యోగుల సంతృప్తి గురించి ఆలోచించడం ప్రారంభించాలి..’ అని స్పందించారు.

‘ఒక కంపెనీ యాజమాన్యం ఇచ్చిన బాధ్యతలను, అసైన్‌మెంట్లను నిర్ధిష్ట సమయంలోగా పూర్తి చేసినప్పుడు మూన్‌లైటింగ్‌పై వాటికి అభ్యంతరం ఉండకూడదు. ఒక వేళ పనితీరు ఆశించిన రీతిలో లేనప్పుడు కంపెనీ ఎలాగూ చర్యలు తీసుకుంటుంది..’ అని మరొక యూజర్ కామెంట్ చేశారు.

‘ఉద్యోగులు విభిన్న ప్రాజెక్టులపై పని చేస్తారు. కానీ క్లయింట్లకు ఆ విషయం తెలియదు. ఇది అనైతికం కాదా?’ అని మరొకరు ప్రశ్నించారు.

‘ఒకవేళ రెండో జాబ్ గురించి యాజమాన్యానికి తెలియపరిచినప్పుడు, ఇద్దరు యజమానులు ఒప్పందానికి లోబడి ఉంటే, అది చట్టబద్ధమైనదిగా పరిగణించాలి..’ అని మరొక యూజర్ తన అభిప్రాయం వెల్లడించారు.

మెజారిటీ ట్విటర్ యూజర్లు మూన్‌లైటింగ్ నైతికమేనని అభిప్రాయపడగా, కొందరు మాత్రం దీనిని తప్పుగా అభివర్ణించారు. ‘ఇది పూర్తిగా అనైతికమే. సదరు ఉద్యోగి ప్రాతినిథ్యం వహిస్తున్న కంపెనీ యొక్క విలువలను తుంగలో తొక్కినట్టే అవుతుంది .. ’ అని మరొక యూజర్ మూన్‌లైటింగ్‌ అనైతికమని తన అభిప్రాయాన్ని చెప్పారు.

Whats_app_banner