NHPC recruitment 2023: ఎన్ హెచ్ పీ సీ లో భారీ రిక్రూట్మెంట్; జేఈ, సూపర్వైజర్, అకౌంటెంట్ పోస్ట్ ల భర్తీ
NHPC recruitment 2023: జలవిద్యుదుత్పత్తి రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ హెచ్ పీ సీ లిమిటెడ్ (NHPC Limited) లో భారీ రిక్రూట్మెంట్ కు తెర లేచింది. జేఈ, సూపర్వైజర్, అకౌంటెంట్ సహా వివిధ కేటగిరీల్లో పలు పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
NHPC recruitment 2023: జలవిద్యుదుత్పత్తి రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ హెచ్ పీ సీ లిమిటెడ్ (NHPC Limited) లో భారీ రిక్రూట్మెంట్ కు తెర లేచింది. జేఈ, సూపర్వైజర్, అకౌంటెంట్ సహా వివిధ కేటగిరీల్లో పలు పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎన్ హెచ్ పీ సీ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ www.nhpcindia.com. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
NHPC jobs:మొత్తం 388 పోస్ట్ లు..
ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ హెచ్ పీ సీ లిమిటెడ్ (NHPC Limited) లో మొత్తం 388 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 9వ తేదీననే ప్రారంభమైంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 30. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్, సీనియర్ అకౌంటెంట్, సూపర్వైజర్, తదితర పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎన్ హెచ్ పీ సీ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ www.nhpcindia.com. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
vacancy details: వేకెన్సీ వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 388 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. వాటిలో..
- జూనియర్ ఇంజినీర్ (సివిల్) - 149 పోస్ట్ లు
- జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 74 పోస్ట్ లు
- జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) - 63 పోస్ట్ లు
- జూనియర్ ఇంజినీర్ (ఈ & సీ E&C) ఎస్ 1 - 10 పోస్ట్ లు
- సూపర్వైజర్ (ఐటీ ఎస్ 1) - 9 పోస్ట్ లు
- సూపర్వైజర్ (సర్వే ఎస్ 1) - 19 పోస్ట్ లు
- సీనియర్ అకౌంటెంట్ (ఎస్ 1) -28 పోస్ట్ లు
- హిందీ ట్రాన్స్ లేటర్ - 14 పోస్ట్ లు
- డ్రాఫ్ట్ మెన్ (సివిల్) - 14 పోస్ట్ లు
- డ్రాఫ్ట్ మెన్ (ఎలక్ట్రికల్, మెకానికల్) - 8 పోస్ట్ లు
- మొత్తం పోస్ట్ ల్లో 14 పోస్ట్ లను దివ్యాంగులకు కేటాయించారు.
- అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల లోపే ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం కేటగిరీల అభ్యర్థులను మినహాయించి, మిగతా వారంతా రూ. 295 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.