New Parliament opening row: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించాలి? ప్రధాాని ప్రారంభించాాలా? లేక రాష్ట్రపతినా?
New Parliament opening row: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని (new Parliament building) ఎవరు ప్రారంభించాలనే విషయంలో వివాదం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28 న పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
New Parliament opening row: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించాలనే విషయంలో వివాదం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28 న పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
New Parliament opening row: రాష్ట్రపతే ప్రారంభించాలి
పార్లమెంటు నూతన భవనాన్ని (new Parliament building) ప్రధాని మోదీ ప్రారంభిస్తారంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై రాజకీయ దుమారం ప్రారంభమైంది. రాజ్యంగాధినేతగా, దేశ శాసన వ్యవస్థకు అధినేతగా ఉన్న రాష్ట్రపతికే కొత్త పార్లమెంటు భవనాన్ని (new Parliament building) ప్రారంభించే అర్హత ఉంటుందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం, ఆప్ వంటి విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కాదని ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా, తొలి దళిత మహిళా రాష్ట్రపతిని అవమానించడమేనని వారు మండిపడ్తున్నారు. రాష్ట్రపతి తరువాత నూతన పార్లమెంటు భవనాన్ని (new Parliament building) ప్రారంభించే అర్హత లోక సభ స్పీకర్ (Lok sabha speaker) కు లేదా రాజ్య సభ చైర్మన్ (Rajya sabha chairman) అయిన ఉప రాష్ట్రపతికి ఉంటుందని వివరిస్తున్నారు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు కనీసం ఆహ్వానం కూడా పంపలేదని కాంగ్రెస్ ఆరోపించింది.
New Parliament opening row: ఎవరికి అధికారం ఉంటుంది?
కీలకమైన శాసన వ్యవస్థ (Legislature), కార్యనిర్వాహక వ్యవస్థ (Executive), న్యాయ వ్యవస్థ (Judiciary) ల అధికారాలు, హక్కుల విషయంలో రాజ్యాంగంలో స్పష్టమైన అధికార విభజన పొందుపర్చి ఉంది. శాసన వ్యవస్థ (Legislature) లో అత్యున్నతమైన పార్లమెంట్ లో రాష్ట్రపతి, లోక్ సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) అంతర్భాగంగా ఉంటాయి. ప్రధాన మంత్రి (Prime Minister) కేంద్ర మంత్రి మండలి (Council of Ministers) కి నేతృత్వం వహిస్తూ.. కార్య నిర్వాహక వ్యవస్థకు అధిపతిగా ఉంటారు. అందువల్ల శాసనవ్యవస్థ (Legislature) కు చీఫ్ గా వ్యవహరించే రాష్ట్రపతి (President) కే పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించే హక్కు, అధికారం ఉంటాయని కాంగ్రెస్ ఇతర విపక్షాలు తేల్చి చెబుతున్నాయి. పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని, ప్రధాని కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
New Parliament opening row: బీజేపీ నేతల మౌనం
అయితే, ఈ వివాదంపై స్పందించడానికి బీజేపీ నేతలు కానీ, కేంద్ర మంత్రులు కానీ ముందుకు రావడం లేదు. సున్నితమైన ఈ వివాదంపై స్పందించకూడదన్న ఆదేశాలు వారికి వచ్చినట్లు తెలుస్తోంది.