NEET PG 2024 Admit Card : నేడు నీట్ పీజీ అడ్మిట్ కార్డులు విడుదల- ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
NEET PG 2024 admit card : నీట్ పీజీ 2024 అడ్మిట్ కార్డులు ఇవాళ విడుదలవుతాయి. అభ్యర్థులు.. తమ అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
NEET PG admit card 2024 : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ) 2024 అడ్మిట్ కార్డులను 2024 జూన్ 18న విడుదల చేయనుంది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్). నీట్ పీజీ 2024 కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి natboard.edu.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
నీట్ పీజీ 2024 పరీక్షను 2024 జూన్ 23న దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఎన్బీఈఎంఎస్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డు లభ్యతకు సంబంధించి అభ్యర్థులకు ఎస్ఎంఎస్/ ఈమెయిల్ అలర్ట్స్, వెబ్సైట్ నోటీసుల ద్వారా సమాచారం అందిస్తారు. అడ్మిట్ కార్డులను అభ్యర్థులకు పోస్ట్/ఈమెయిల్ ద్వారా పంపరు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ బార్కోడెడ్ / క్యూఆర్ కోడ్డ్ అడ్మిట్ కార్డు ప్రింట్ కాపీ, పర్మినెంట్ / ప్రొవిజనల్ ఎస్ఎంసీ / ఎంసీఈ / ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ఫోటోకాపీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు (ఫోటోతో సహా) తీసుకు వెళ్లాలి. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.
నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019లోని సెక్షన్ 61(2) ప్రకారం వివిధ ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నీట్ పీజీని నిర్వహిస్తారు.
నీట్ పీజీ అడ్మిట్ కార్డ్ 2024: ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
How to download NEET PG admit card : నీట్ పీజీ అడ్మిట్ కార్డు 2024 డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్‌ని ఫాలో అవ్వొచ్చు.
స్టెప్ 1:- natboard.edu.in వద్ద ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
స్టెప్ 2:- హోమ్ పేజీలో నీట్ పీజీ అడ్మిట్ కార్డు 2024 చెక్ చేయడానికి లింక్ కోసం చూడండి. లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను పేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 4:- లాగిన్ వివరాలను సమర్పించిన తర్వాత అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.
NEET PG 2024 : స్టెప్ 5:- అడ్మిట్ కార్డులోని వివరాలను ధృవీకరించండి. పేజీని సేవ్ చేయండి.
స్టెప్ 6:- భవిష్యత్తు అవసరాల కోసం అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
నీట్ పీజీ 2024 ఎగ్జాక్ సంబంధించి.. మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
నీట్ యూజీ 2024పై నిరసనలు..
NEET UG 2024 Supreme court : ఇటీవల వెలువడిన నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలు చుట్టూ వివాదం నెలకొనడంతో నీట్ పీజీ నిర్వహణపై ఫోకస్ పెరిగింది. పేపర్ లీక్, ఫలితల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 0.001శాతం తప్పు జరిగినా.. తీవ్ర చర్యలు తీసుకోవాలని.. నీట్ యూజీ 2024ను నిర్వహించిన ఎన్టీఏకి చెప్పింది సుప్రీంకోర్టు. నీట్ యూజీ రద్దు పిటిషన్లకు సంబంధించిన కేసులపై జులై 8న విచారణ జరపనున్నట్టు స్పష్టం చేసింది.
సంబంధిత కథనం