NEET Counselling 2022: నీట్ స్టేట్ కోటా షెడ్యూలు విడుదల చేసిన ఎంసీసీ-neet counselling 2022 state quota schedule released by mcc see details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Counselling 2022: నీట్ స్టేట్ కోటా షెడ్యూలు విడుదల చేసిన ఎంసీసీ

NEET Counselling 2022: నీట్ స్టేట్ కోటా షెడ్యూలు విడుదల చేసిన ఎంసీసీ

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 08:48 AM IST

NEET 2022 Counselling: నీట్ స్టేట్ కోటా తేదీలను ఎంసీసీ సిఫారసు చేసింది.

<p>NEET Counselling 2022: స్టేట్ కోటా షెడ్యూలు విడుదల చేసిన ఎంసీసీ</p>
NEET Counselling 2022: స్టేట్ కోటా షెడ్యూలు విడుదల చేసిన ఎంసీసీ (HT Representative Image)

NEET UG Counselling 2022: మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఇటీవల నీట్ 15% ఆల్ ఇండియా కోటా (AIQ), డీమ్డ్, సెంట్రల్ యూనివర్శిటీల్లో కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ నిర్వహించడానికి తేదీలను ప్రకటించింది.

అక్టోబర్ 10 నుంచి 20 వరకు ఎంసీసీ నీట్ తొలి రౌండ్ కౌన్సెలింగ్ జరగనుండగా, 85% రాష్ట్ర కోటా సీట్లకు అక్టోబర్ 17 నుంచి 28 వరకు నిర్వహించాలని కమిటీ సూచించింది.

రాష్ట్ర కౌన్సెలింగ్ అధికారులు తమ వెబ్‌సైట్‌లలో ప్రత్యేక షెడ్యూల్‌లను ప్రచురిస్తారు. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ కోసం ఈ షెడ్యూల్ కేవలం సూచన మాత్రమే అని ఆశావహులు గమనించాలి. తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

మొదటి రౌండ్ రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌లో కేటాయించిన సీటుపై అడ్మిషన్ తీసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 4 అని పేర్కొంది.

రాష్ట్ర కోటా నీట్ కౌన్సెలింగ్ 2022 యొక్క రెండో రౌండ్ నవంబర్ 7 నుండి 18 వరకు ఉంటుంది, ఒక విద్యా సంస్థలో చేరడానికి చివరి తేదీ నవంబర్ 21 అని కమిటీ తెలిపింది. మాప్-అప్ రౌండ్ డిసెంబర్‌లో జరుగుతుంది.

రాబోయే బ్యాచ్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల కోసం అకడమిక్ సెషన్ నవంబర్ 15న ప్రారంభమవుతుంది. మరింత సమాచారం కోసం దిగువ షెడ్యూల్‌ని జాగ్రత్తగా పరిశీలించండి.

Whats_app_banner

టాపిక్