IMD rain alert : ఇంకొన్ని రోజుల వరకు ఈ రాష్ట్రాల్లో వానలే.. వానలు!
IMD rain alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు జోరుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఆ వివరాలు..
IMD rain alert : దేశవ్యాప్తంగా రానున్న కొన్ని రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యం తూర్పు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్‌లో అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణ, ఛండీగఢ్, దిల్లీ, తూర్పు రాజస్థాన్, జమ్ము, మధ్యప్రదేశ్‌లో సైతం వర్షాలు పడతాయని పేర్కొంది.
ఇక దేశ రాజధాని దిల్లీలో శనివారం తెల్లవారుజామున నుంచి వర్షం జోరుగా కురుస్తోంది. పలు ప్రాంతాలు ఇప్పటికే మునిగిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మహారాష్ట్రలోని ఉత్తర కోంకణ్, దక్షిణ కోంకణ్-గోవాలు శనివారం మోస్తరు వర్షాలు పడతాయి. ఉత్తర, మధ్య, దక్షిణ మహారాష్ట్రలో సైతం వానలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో..
Himachal Pradesh rains : హిమాచల్ ప్రదేశ్‌లో రానున్న 4-5 రోజుల పాటు మోస్తరు వానలు పడతాయి. ఆగస్ట్ 6 తర్వాత నుంచి ఈ ప్రాంతంలో వానలు తగ్గుముఖం పడతాయి.
"సిర్మౌర్, సోలన్, శిమ్లా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటంతో పాటు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులకు హెచ్చరికలు జారీ చేశాము," అని ఐఎండీ స్పష్టం చేసింది.
రుతుపవనాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 24 నుంచి ఇప్పటివరకు 200మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 238 మంది గాయపడ్డారు. 32మంది గల్లంతయ్యారు.
ఇతర ప్రాంతాల్లో ఇలా..
Telangana floods latest news : ఒడిశాలోనూ వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. 21జిల్లాల్లోని 4లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 2,329 ఇళ్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని 52వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు.
ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌లో ఈనెల 8 వరకు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణ, ఛండీగఢ్-దిల్లీలో ఈ నెల 6 వరకు, జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నాడు అతి భారీ వర్షాలు కురుస్తాయి.
రానున్న 3,4 రోజుల పాటు దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో విస్తారణంగా వర్షాలు కురుస్తాయి.
ఆగస్ట్‌లో సాధారణం కన్నా తక్కువే..!
August rainfall 2023 : ఆగస్ట్ నెలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. ఆగస్ట్‌లో సగటు వర్షపాతం 90శాతంగా ఉండవచ్చని పేర్కొంది. వర్షాకాలానికి సంబంధించినంత వరకు ఆగస్ట్ నెల చాలా కీలకం. ఈ నెలలో కురిసే వర్షాలు వ్యవసాయ పరిస్థితులను నిర్దేశిస్తాయి. అలాంటిది.. తక్కువ వర్షాలు పడతాయని వస్తున్న అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం