Delhi rape case : పోలీసు అధికారి అని చెప్పి.. యువతిపై అత్యాచారం!-man poses as delhi police officer rapes 20 year old inside her apartment complex ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Rape Case : పోలీసు అధికారి అని చెప్పి.. యువతిపై అత్యాచారం!

Delhi rape case : పోలీసు అధికారి అని చెప్పి.. యువతిపై అత్యాచారం!

Sharath Chitturi HT Telugu
Jul 14, 2023 07:56 AM IST

Delhi rape case : ‘నువ్వు, నీ బాయ్​ఫ్రెండ్​ కలిసి ఉన్న వీడియోలు నా దగ్గర ఉన్నాయి. సోషల్​ మీడియాలో లీక్​ చేస్తా,’ అని బెదిరించిన ఓ వ్యక్తి, ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను దిల్లీ పోలీసును అంటూ చెప్పుకొచ్చాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

పోలీసు అధికారి అని చెప్పి.. యువతిపై అత్యాచారం!
పోలీసు అధికారి అని చెప్పి.. యువతిపై అత్యాచారం!

Delhi rape case : పోలీసు అధికారిని అంటూ.. ఓ 20ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దిల్లీలో జరిగిన ఈ ఘటన వార్తలకెక్కింది.

ఇదీ జరిగింది..

దిల్లీలోని ఓ గేటెడ్​ సొసైటీలో జులై 7 రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాలు.. తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళుతుండగా.. మెట్ల మార్గంలో ఓ వ్యక్తి ఆమెను అడ్డుకున్నాడు. తనని తాను, దిల్లీ పోలీసు అధికారి అని పరిచయం చేసుకున్నాడు. ఓ ఐడీ కార్డును కూడా చూపించాడు! యువతికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఇంతలో ఆ వ్యక్తి, యువతిని బెదిరించాడు.

"నువ్వు, నీ బాయ్​ఫ్రెండ్​ సన్నిహితంగా ఉన్న వీడియో నా దగ్గర ఉంది. ఇది మీ ఇంట్లో వాళ్లకి చూపిస్తాను. సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తాను," అని ఆ వ్యక్తి అనడంతో యువతి భయపడిపోయింది. ఆ తర్వాత, ఆమెను బెదిరించి ఇంటి మీదకు తీసుకెళ్లాడు. అక్కడే 20ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే, వీడియోను లీక్​ చేస్తానని బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

తనకు ఎదురైన ఘటనతో యువతి భయపడిపోయింది. కొన్ని రోజుల పాటు ఎవరికి ఏం చెప్పలేదు. చివరికి ధైర్యం తెచ్చుకుని పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. తనకు జరిగినది వివరించింది. దిల్లీ పోలీసు నుంచి ఓ వ్యక్తి తనను రేప్​ చేశాడని ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే.. నిందితుడు పేరు రవి సొలంకి అని, అతను అసలు పోలీసుశాఖలోనే పనిచేయడం లేదని తెలుసుకున్నారు.

Delhi crime news : "కష్టమైన కేసును మేము ఛేదించాము. నిందితుడి వివరాలు ఎవరికి తెలియదు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో అతని ముఖాన్ని గీయించాము. మరోవైపు అత్యాచారానికి పాల్పడిన తర్వాత.. ఓ బైక్​ మీద అతను రైథల మెట్రో స్టేషన్​ వరకు వెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్​లో స్పష్టంగా ఉంది. కానీ అక్కడి నుంచి మాయమైపోయాడు. 250కిపైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించాము. 40మందినిపైగా వ్యక్తులను విచారించాము. 1000కిపైగా వాహనాలను పరీక్షించాము. చివరికి.. గురువారం అతడిని పట్టుకున్నాము. మాకు అందిన సమాచారంతో సెక్టార్​ 24లోని ఓ మాల్​కు వెళ్లి, అతడిని అరెస్ట్​ చేశాము," అని పోలీసు అధికారి వెల్లడించారు.

నిందితుడిని విచారించిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు.

"ఆమెను, ఆమె బాయ్​ఫ్రెండ్​ను నేను చాలా రోజులుగా ఫాలో అయ్యాను. కారులో ఉన్నప్పుడు వారి ఫొటోలను తీశాను. ఆమె ఒంటరిగా ఉండటం కోసం ఎదురుచూశాను. ఇండియాలో మహిళలు, వారి బాయ్​ఫ్రెండ్స్​ గురించి తల్లిదండ్రులకు చెప్పరు. అలా ఆమెను భయపెట్టాను," అని నిందుతుడు పోలీసులకు వివరించాడు.

33ఏళ్ల సొలంకి.. పూత్​ కలాన్​ గ్రామానికి చెందినవాడు. 2016లో అతనికి పెళ్లి జరిగింది. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్మగ్లింగ్​కు సంబంధించి అతనిపై ఇప్పటికే 5 కేసులు ఉన్నాయి.

ఐడీ కార్డు కూడా ఫేక్​..!

Delhi woman raped : ఘటన జరిగిన సమయంలో యువతికి నిందితుడు చూపించిన ఐడీ కార్డు ఫేక్​ అని తేలింది. తన వద్ద ఉన్న ఆర్మ్స్​ లైసెన్స్​​ను చూపించి, అది దిల్లీ పోలీసు కార్డు అని అబద్ధం చేప్పాడు. దానిపై దిల్లీ పోలీసు విభాగానికి చెందిన వాటర్​మార్క్​, మోనోగ్రామ్​ ఉండటంతో బాధితురాలు నమ్మేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం