రెండేళ్ల బాలికపై రేప్, హత్య.. పాప బంధువునూ వదలని కిరాతకుడు
రెండేళ్ల బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. అంతేకాదు.. అంతకుముందే ఆ పాప బంధువును కూడా రేప్ చేశాడు. ఈ ఉదంతం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బాగేశ్వర్ జిల్లాలో రెండేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ చిన్నారి నేపాల్‌కు చెందిన వ్యక్తి.
అయితే నిందితుడి బెదిరింపులకు గురైన బాధితురాలి వదిన ఎట్టకేలకు పోలీసులకు ఆదివారం అసలు విషయం చెప్పడంతో పోలీసులు కేసును ఛేదించారు.
జూన్ 18న బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు వారి ఇంటి చుట్టూ రక్తపు మరకలను గుర్తించడంతో గ్రామస్తులు బాలికపై పులి దాడి చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పులి ఆమె మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లిందని భావించారు.
కాగా బాలిక మిస్సింగ్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న చిన్న వాగులో పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఆమె గొంతు నులిమి చంపిన గుర్తులను పోలీసులు గుర్తించారు. అలాగే బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో బాధితురాలి వదిన జూన్ 25న పోలీసులకు అసలు విషయం తెలిపింది. తమ ఇంటి యజమాని కుమారుడైన ధీరజ్ తివారీ అనే ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు అత్యాచారం చేసి చంపినట్లు వెల్లడించిందని బాగేశ్వర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జె.ధాక్రియాల్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 376(2)(ఎన్), 506 కింద నిందితులపై కేసు నమోదు చేశారు.
నిందితుడు తనపై కూడా పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె చెప్పిందని పోలీసులు తెలిపారు.
జూన్ 18న తివారీ తమ ఇంటికి వచ్చి తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని, అయితే తాను ప్రతిఘటించడంతో అతను చిన్నారి ఉన్న గదిలోకి వెళ్లాడని బాధితురాలి వదిన తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత నిందితుడి చిన్నారిపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని వాగులో రాయి కింద దాచాడు.
నిందితుడు చిన్నారి మృతదేహాన్ని గది నుంచి బయటకు తీసుకెళ్లడం తాను చూశానని ఆ చిన్నారి వదిన తెలిపింది. నిందితుడు తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన గురించి ఎవరికైనా చెబితే వారి కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది.
కాగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
టాపిక్