Weight Loss: 30 రోజులు ముప్పొద్దులా పిజ్జాలు తిని బరువు తగ్గాడు.. ఎలా?
Weight Loss: 30 రోజుల పాటు మూడు పూటలా కేవలం పిజ్జాలు (Pizza) తిని ఓ వ్యక్తి బరువు తగ్గాడు. శరీరంలోని కొవ్వును తగ్గించుకున్నాడు. వివరాలివే..
Weight Loss: పిజ్జా అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. పైన క్రిస్పీగా ఉంటూ, కరిగించిన చీజ్, రకరకాలైన టాపింగ్స్ కాంబినేషన్‍తో ఎంతో రుచిగా ఉండే పిజ్జాలు (Pizzas) అంటే చాలా ఇష్టంగా తింటారు. అయితే బరువు తగ్గాలని అనుకుంటున్న వారికి పిజ్జాలు సరైన ఆప్షన్ కాదు. ఎందుకంటే క్యాలరీలు, కొవ్వు పదార్థాలు, సోడియం.. పిజ్జాల్లో ఎక్కువగా ఉంటాయి. పిజ్జాలు ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా ఉంటుంది. అయితే, ఎవరైనా పిజ్జాలు తిని బరువు తగ్గారని మీరు విన్నారా? కానీ ఇది జరిగింది. 30 రోజుల చాలెంజ్‍లో భాగంగా రోజుకు 3 పూటలా (ముప్పొద్దులా) పిజ్జాలు మాత్రమే తిని ఓ వ్యక్తి బరువు తగ్గాడు. వివరాలివే..
రోజుకు 10 పీస్‍లు
Weight Loss: ర్యాన్ మెర్సెర్ అనే పర్సనల్ ట్రైనర్ ఇలా 30 రోజులు మూడు పూటలా పిజ్జాలు తిని బరువు తగ్గారని ల్యాడ్‍బైబిల్ అనే బ్రిటన్ వెబ్‍సైట్ రిపోర్ట్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం, ర్యాన్ మెర్సెర్ రోజుకు 10 పిజ్జా స్లైసెస్ తినేవారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా మూడు పూటలా ఇవే తినేవారు. 30 రోజులు ఇలానే చేశారు. పిజ్జా తప్ప మరేమీ తినేవారు కాదు. అన్ని రకాల జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ వదిలేశారు. కేవలం ఆ 30 రోజులు పిజ్జాలు మాత్రమే తినేవారు.
ఇదే చెప్పాలనుకుంటున్నా..
Weight Loss: ఇష్టమైన ఆహారంపై ఆంక్షలు పెట్టుకోకుండా తన లక్ష్యాన్ని ఎలా సాధించారో ర్యాన్ మెర్సెర్ వివరించారు. “కొవ్వు తగ్గించుకోవడం, క్యాలరీల లోటు గురించి మాత్రమే నేను హైలైట్ చేయాలనుకోవడం లేదు. ఫలితాలను పొందేందుకు మనకు ఇష్టమైన ఆహారాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని ప్రజలు స్వయంగా వండుకోవాలని చెప్పాలనుకుంటున్నా. ఆ దిశగా వారిని ప్రోత్సహించాలనుకుంటున్నా” అని మెర్సెర్ చెప్పారు. అంటే ఇష్టమైన ఆహారాన్ని సరైన పద్ధతిలో స్వయంగా వండుకొని తింటే బరువు తగ్గాలన్న లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన చెప్పారు. అలాగే పిజ్జాలు తిన్న 30 రోజుల్లో ఆయన ఎలాంటి జంక్ ఫుడ్‍లు తినలేదు.
Weight Loss: సాధారణంగా తన డెయిట్‍లో పండ్లు, కూరగాయలు, ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారం ఉంటాయని ర్యాన్ చెప్పారు. అయితే జనవరిలో మాత్రం, 30 రోజులు మూడు పూటలా పిజ్జాలే తిన్నట్టు వెల్లడించారు. రకరకాల ఫ్లేవర్లతో డిఫరెంట్ పిజ్జాలను తయారు చేసుకొని తిన్నానని, అందుకే 30 రోజులు తిన్నా బోరు కొట్టలేదని అన్నారు. తాను సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీ రోజు 1,800 నుంచి 2,100 క్యాలరీలను తీసుకుంటానని, శనివారం, ఆదివారం 2,700 క్యాలరీలు ఉండేలా తింటానని చెప్పారు.
దీన్ని చూసి మీరు కూడా పిజ్జాలు తిని బరువు తగ్గొచ్చని అనుకుంటారేమో. కానీ ఇది అందరికీ సూటవదు. ప్రతీ ఒక్కరూ విభిన్నంగా ఉంటారని, వారు శరీరానికి అనుగుణంగా వారికి సూటయ్యే పద్ధతిలో డెయిట్ చేయాలని ర్యాన్ మెర్సెర్ చెప్పారు. అలా అయితేనే ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.
పిజ్జాలు అతిగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని గతంలో చాలా అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే పరిమితి మేరనే పిజ్జాలు తీసుకోవాలి.
సంబంధిత కథనం