Air India urination case: సహ ప్రయాణికురాలిపై మూత్రం పోసిన వ్యక్తి అరెస్ట్
Air India urination case: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో మద్యం మత్తులో సహ ప్రయాణికురాలిపై మూత్రం పోసిన (urination) శంకర్ మిశ్రా (Shankar Mishra) ను శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.
Air India urination case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సహప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రా (Shankar Mishra) ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఒక అపార్ట్ మెంట్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Air India urination case accused arrested: మొబైల్ ఫోన్ ఆఫ్ చేసినా..
పోలీసులకు పట్టుపడకుండా ఉండడం కోసం, శంకర్ మిశ్రా (Shankar Mishra) అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులను కాంటాక్ట్ చేయలేదు. మొబైల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేశాడు. కానీ కొన్ని పొరపాట్లు చేసి దొరికిపోయాడు. తన సొంత వాహనం రెడ్ కలర్ జీప్ లోనే ప్రయాణం సాగించాడు. సోషల్ మీడియాలో కొందరు ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ లో ఉన్నాడు. అలాగే, కొన్ని చోట్ల తన క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేశాడు. శంకర్ మిశ్రా (Shankar Mishra) కోసం గాలిస్తున్న పోలీసులు.. ఆ ట్రాన్సాక్షన్స్ ను ట్రేస్ చేసి, శంకర్ మిశ్రా బెంగళూరు వెళ్లినట్లు గుర్తించారు. దాంతో, బెంగళూరు పోలీసులను అలర్ట్ చేశారు. స్వయంగా ఢిల్లీ పోలీస్ బృందం బెంగళూరు వెళ్లింది. బెంగళూరులోని మరతల్లి ప్రాంతంలో శంకర్ ఉన్నట్లు గుర్తించినప్పటికీ.. మొదట అతడిని పట్టుకోలేకపోయారు. ఆ తరువాత, శంకర్ మిశ్రా (Shankar Mishra) బెంగళూరులోని సంజయ్ నగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో ఉన్నట్లు వారికి విశ్వసనీయ సమాచారం లభించింది. దాంతో, శనివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో అతడిని అదుపులోకి తీసుకుని, ఢిల్లీ తీసుకువచ్చారు.
Air India urination case: 14 రోజుల రిమాండ్
అనంతరం, శనివారం ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు శంకర్ మిశ్రాకు 14 రోజుల రిమాండ్ విధించింది. శంకర్ మిశ్రా (Shankar Mishra) వెల్స్ ఫార్గో (wells fargo) అనే మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో పని చేసేవాడు. ఈ ఘటన అనంతరం అతడిని ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది.
టాపిక్