Dimple to defend Mulayam’s MP seat: ములాయం లోక్ సభ సీట్లో కోడలు డింపుల్ పోటీ
Dimple to defend Mulayam’s MP seat: ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక నాయకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం అనంతరం ఆయన లోక్ సభ స్థానం నుంచి ఎవరు పోటీ పడనున్నారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
Dimple to defend Mulayam’s MP seat: ఉత్తర ప్రదేశ్ లోని మైన్ పురి లోక్ సభ స్థానం నుంచి ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించేవారు. వృద్ధాప్య సమస్యలతో ఈ అక్టోబర్ 10న ఆయన మరణించారు. అందువల్ల ఆ స్థానంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎంపీ స్థానంలో ములాయం వారసత్వం ఎవరికి లభిస్తుందనే విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.
Dimple to defend Mulayam’s MP seat: ఉప ఎన్నిక..
మైన్ పురి ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ ల పేర్లు వినిపించాయి. వారితో పాటు ములాయం కోడలు డింపుల్ యాదవ్ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసి లోక్ సభలో అడుగుపెట్టాలని భావించారు. ఈ సస్పెన్స్ కు తెర దించుతూ, సమాజ్ వాదీ పార్టీ గురువారం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.
Dimple to defend Mulayam’s MP seat: డింపుల్ కే అవకాశం
మైన్ పురి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ములాయం సింగ్ యాదవ్ కోడలు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య అయిన డింపుల్ యాదవ్ కే ఇవ్వాలని సమాజ్ వాదీ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ ఉప ఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. డింపుల్ యాదవ్ గతంలో కనౌజ్ ఎంపీ స్థానం నుంచి గెలుపొందారు. భర్త అఖిలేశ్ సీఎం కావడంతో ఆయన రాజీనామా చేసిన కనౌజ్ లోక్ సభ స్థానం నుంచి 2012లో డింపుల్ పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2014లోనూ ఆమె ఆ సీటును నిలబెట్టుకున్నారు. కానీ, 2019లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.