Mahila Samman Savings Certificate : మహిళల కోసమే ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా? రిస్క్ ఉండదు-mahila samman savings certificate better scheme for women to increase savings amount you can apply multiple accounts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mahila Samman Savings Certificate : మహిళల కోసమే ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా? రిస్క్ ఉండదు

Mahila Samman Savings Certificate : మహిళల కోసమే ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా? రిస్క్ ఉండదు

Anand Sai HT Telugu
Aug 11, 2024 09:10 PM IST

Mahila Samman Savings Certificate : మహిళల కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం ప్రారంభించింది. దీనితో మీరు మంచి వడ్డీని పొందవచ్చు. ఈ పథకం గురించిన వివరాలు తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ప్రభుత్వ పెట్టుబడి పథకాలు సురక్షితమైన పెట్టుబడి ద్వారా మెరుగైన రాబడిని అందిస్తాయి. ఉత్తమమైనవిగా పరిగణిస్తారు. ఎందుకంటే రిస్క్ ఎక్కువగా ఉండదు. పేద కుటుంబాల కోసం ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను అందజేస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పెట్టుబడి పథకం అలాంటిదే. మహిళలు పొదుపును పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప పథకం. ఈ పథకం కింద మహిళలు మాత్రమే ఖాతా తెరవడం దీని ప్రత్యేకత.

2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకంభారీ లాభాల కారణంగా, ఈ ప్రాజెక్ట్ తక్కువ వ్యవధిలో పోస్ట్ ఆఫీస్ ప్రసిద్ధ ప్రాజెక్టులలో స్థానం సంపాదించగలిగింది. దీంతో పాటు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ మహిళలకు ఇష్టమైన పథకంగా మారింది. ఈ పథకం కింద ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే రెండేళ్ల కాలానికి ఈ పథకంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఈ పథకం కింద గరిష్ట పెట్టుబడి మొత్తం రూ. 2 లక్షలుగా ఉంటుంది.

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. మెరుగైన వడ్డీని అందించడమే కాకుండా ఈ పథకం TDSపై మినహాయింపును కూడా అందిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం సీనియర్ సిటిజన్ల విషయంలో ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ. 40,000 నుంచి రూ. 50,000 మధ్య ఉంటే మాత్రమే ఈ పథకం కింద TDS వర్తిస్తుంది.

ఈ పథకం కింద 10 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల పేరుతో కూడా ఖాతాలు తెరవవచ్చు. అంతేకాకుండా భారతీయ నివాస స్త్రీలు ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఒక మహిళ బహుళ ఖాతాలను తెరవవచ్చు. మీరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో గరిష్టంగా రూ. 2 లక్షల మొత్తాన్ని 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే రెండేళ్లలో వడ్డీ ద్వారా రూ.32,044 సంపాదించవచ్చు. అప్పుడు పెట్టుబడి మొత్తంతో సహా మీ మొత్తం రాబడి రూ.2,32,044 అవుతుంది. మీరు ఖాతాను మూసివేసి విత్‌డ్రా చేసుకోవచ్చు.

అయితే చాలా మంది బయట వడ్డీకి ఇచ్చుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. అయితే ఇది ప్రభుత్వ పథకం.. మీకు రిస్క్ ఉండదు. కచ్చితంగా మీ డబ్బులు వడ్డీతో సహా తీరిగి వచ్చేస్తాయి. అదే బయట ఇస్తే కొన్నిసార్లు వస్తాయో రావో కూడా చెప్పలేం.

Whats_app_banner