LeT commander killed in Kashmir encounter: భద్రతా బలగాల క్యాంప్ పై ఉగ్ర దాడి కోసం వెళ్తున్న ఉగ్రవాది సహా మొత్తం నలుగురిని మంగళవారం సైన్యం మట్టుబెట్టింది.
కశ్మీర్ లోని అవంతిపుర వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు కాల్చి చంపాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒక లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన కమాండర్ ముఖ్తార్ భట్ కూడా ఉన్నారు. ఎన్ కౌంటర్ అనంతరం ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. లష్కరే కమాండర్ ముఖ్తార్ భట్ కశ్మీర్ లోని ఒక ఆర్మీ క్యాంప్ పై ఆత్మాహుతి దాడి కోసం తన టీమ్ తో వెళ్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఏకే 74, ఏకే 56 రైఫిల్స్, ఒక పిస్టల్, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. మంగళవారం జరిగిన ఈ రెండు ఎన్ కౌంటర్లు సెక్యూరిటీ ఫోర్సెస్ కు భారీ విజయమని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.