Doctor Rape Case : వైద్యురాలిపై అత్యాచారం కేసు.. శవ పరీక్షలో నమ్మలేని నిజాలు.. దారుణంగా టార్చర్ చేసి..!-kolkata doctor rape murder autopsy reveals shocking things genital torture deep gash in private parts details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Doctor Rape Case : వైద్యురాలిపై అత్యాచారం కేసు.. శవ పరీక్షలో నమ్మలేని నిజాలు.. దారుణంగా టార్చర్ చేసి..!

Doctor Rape Case : వైద్యురాలిపై అత్యాచారం కేసు.. శవ పరీక్షలో నమ్మలేని నిజాలు.. దారుణంగా టార్చర్ చేసి..!

Anand Sai HT Telugu
Aug 13, 2024 05:01 PM IST

Kolkata Doctor Rape Case : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను దారుణంగా టార్చర్ చేసి చంపేసినట్టుగా శవ పరీక్షలో తేలింది. బాధితురాలిని ఉక్కిరిబిక్కిరి చేసి అత్యాచారం చేసి హత్య చేశారు.

కోల్‌కతాలో డాక్టర్ అత్యాచారం, హత్యకు సంఘీభావంగా మహారాష్ట్ర వైద్యుల నిరసన
కోల్‌కతాలో డాక్టర్ అత్యాచారం, హత్యకు సంఘీభావంగా మహారాష్ట్ర వైద్యుల నిరసన

పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం నివేదికలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ఆమె జననాంగలపై గాయాలు చేసి చంపేశారు. ఆమె ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం కనిపించింది. బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసారు. గొంతు నులిమి చంపిన కారణంగా ఆమె థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయినట్లు గుర్తించారు.

ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగింది. నివేదిక ప్రకారం, బాధితురాలి బొడ్డు, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు ఉన్నాయి. బాధితురాలి నోరు మూసేసి.. కేకలు వేయకుండా ఆమె తలను గోడ లేదా నేలపైకి నెట్టారని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

కేకలు వేయకుండా ఉండేందుకు బాధితురాలి నోరు, గొంతును నిరంతరం నొక్కి ఉంచారు. మహిళ కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారింది. ఇప్పటికే ఈ ఘటనపై కోల్‌కతాలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని నిరసనలు చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌కు బాధితురాలు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లింది. ఆమె ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉంది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో బాధితురాలు పడి ఉంది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

నిందితుడి నాలుగు పెళ్లిళ్లు

అయితే నిందితుడి సంజయ్ రాయ్ హింసాత్మకమైన పోర్న్ క్లిప్‌లను చూసేందుకు ఇష్టపడుతాడని ఒక పోలీసు అధికారి తెలిపారు. అతడు నాలుగుసార్లు వివాహం చేసుకున్నాడు. సంజయ్ రాయ్ తల్లి తన కొడుకు నిర్దోషి అని, అతనిని ఇరికిస్తున్నారని చెబుతున్నారు. సంజయ్ రాయ్ శిక్షణ పొందిన బాక్సర్. ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో అతన్ని నియమించారు.

నేరం తర్వాత నిద్ర

నేరం చేసిన తర్వాత సంజయ్ రాయ్ తన బ్యారక్‌కు తిరిగి వెళ్లి చాలా గంటలు నిద్రపోయాడని పోలీసులు తెలిపారు. అతను మేల్కొన్న తర్వాత నేరానికి సంబంధించిన సాక్ష్యాలను చెరిపివేయడానికి తన బట్టలు ఉతికాడు. అయితే అతడి షూపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నేరం జరిగిన ప్రదేశంలో సంజయ్ రాయ్ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను పోలీసులు కనుగొన్న తర్వాత అరెస్టు చేశారు.

అయితే ఈ ఘటనపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వ్యక్తే ఇలా చేసి ఉండరు అని ఆరోపిస్తున్నారు. కానీ శవపరీక్షలో మాత్రం దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి.

టాపిక్