Chandigarh rape case : 22ఏళ్ల తర్వాత దొరికిన అత్యాచార నిందితుడు..
Rape accused arrested after 22 years : ఛండీగఢ్‌లో 22ఏళ్ల క్రితం నేరానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 22ఏళ్ల క్రితం.. ఆ వ్యక్తి, ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Rape accused arrested after 22 years : చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేందుకు ఉదాహరణగా నిలిచిన ఘటన ఇది. ఓ వ్యక్తి.. ఓ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు! 22ఏళ్లుగా అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి అతడు పోలీసులకు చిక్కాడు. ఛండీగఢ్‌లో జరిగిన ఈ ఘటన వార్తలకెక్కింది.
ట్రెండింగ్ వార్తలు
ఏం జరిగింది..?
ఇది 2000 అక్టోబర్ నాటి ఘటన. ఓ 11ఏళ్ల మైనర్.. తన కుటుంబంతో పాటు ఓ గుడిసెలో నివాసముండేది. కాగా.. ఆ నెల 20వ తేదీన రాత్రి 9:30 గంటలకు ఆమె బయటకు వెళ్లింది. ఆ తర్వాత తిరిగి రాలేదు.
బిడ్డ కనపడకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు ఆమె తండ్రి. ముకేశ్ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉన్నట్టు వివరించాడు. అతడే తన బిడ్డను అపహరించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు.
Chandigarh rape case : ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. మైనర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజుల్లోపు.. బాలికను గుర్తించి, రక్షించారు. కానీ ముకేశ్.. చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సెక్షన్ 363, 366, 376 కింద.. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కేసు వేశారు. అతడి కోసం బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ పోలీసులకు ముకేశ్ దొరకలేదు. 2021 అక్టోబర్‌లో ముకేశ్‌ను.. ప్రొక్లైమ్డ్ అఫెండర్‌గా ప్రకటించారు అప్పటి మెజిస్ట్రేట్ సీఎల్ మోహన్.
22ఏళ్లకు దొరికిన ముకేశ్..
22ఏళ్ల పాటు పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగాడు ముకేశ్. ఎన్నో ఏళ్ల పాటు.. దొరికినట్టే దొరికి పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకున్నాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఫలితం దక్కలేదు.
ఇటీవలే.. కొన్ని పాత కేసులను బయటకు తీసింది ప్రొక్లైమ్డ్ అఫెండర్ అండ్ సమన్ స్టాఫ్ ఆఫ్ ఛండీగఢ్ పోలీసు శాఖ. ఈ క్రమంలోనే ఘోర నేరాలకు పాల్పడిన నేరగాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ జాబితాలో ముకేశ్ పేరు కూడా ఉంది. ముకేశ్‌ను పట్టుకునేందుకు మరో ప్రయత్నం చేశారు పోలీసులు.
ఈ నేపథ్యంలోనే.. పోలీసులకు ఓ కీలక సమాచారం అందింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముకేశ్ ఉన్నట్టు పోలీసులకు తెలిసింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముకేశన్ను వెంబడించారు. చివరికి పట్టుకున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు ముకేశ్ చేసిన ఆఖరి ప్రయత్నం విఫలమైంది. పొలాల్లో హై ఓల్టేజ్ ఛేజ్ తర్వాత.. ముకేశ్ పోలీసుల చేతికి చిక్కాడు. అతడిని ఛండీగఢ్‌కు పట్టుకెళ్లారు.
సంబంధిత కథనం