woman raped: మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారం, ఇద్దరి అరెస్టు-karnataka woman drugged raped in udupis karkala 2 arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Woman Raped: మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారం, ఇద్దరి అరెస్టు

woman raped: మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారం, ఇద్దరి అరెస్టు

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 07:21 PM IST

కర్నాటకలో మరో దారుణం జరిగింది. ఒక యువతిని అల్తాఫ్ అనే వ్యక్తి కారులో కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిద్దరికి గత మూడు నెలలుగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారం, ఇద్దరి అరెస్టు
మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారం, ఇద్దరి అరెస్టు (HT_PRINT)

కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న కర్కల పట్టణంలో 24 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 23 రాత్రి కర్కల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కర్కల పట్టణానికి చెందిన బాధితురాలిని అల్తాఫ్ అనే వ్యక్తి కిడ్నాప్ (kidnap) చేసి కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇన్ స్టా లో ఫ్రెండ్స్

ఉడిపి పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ కె తెలిపిన వివరాల ప్రకారం, బాధిత యువతి, నిందితుడైన అల్తాఫ్ గత మూడు నెలలుగా ఇన్స్టాగ్రామ్ (instagram) లో స్నేహితులు. ఇద్దరూ ఒకే పట్టణానికి (కర్కల) చెందినవారు. శుక్రవారం మహిళ కార్యాలయానికి వచ్చిన అల్తాఫ్ ఆమెను కారులో తీసుకువెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆల్తాఫ్ ఫ్రెండ్ రిచర్డ్ కార్డోజా కూడా అదే కారు ఎక్కాడు. అల్తాఫ్ వద్ద అప్పటికే మద్యం బాటిల్ ఉంది. ఆ బాటిల్ లోని మద్యాన్ని ఆ యువతికి బలవంతంగా తాగించారు. మద్యం బాటిళ్లు తాగించి మహిళను బలవంతంగా తాగించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ యువతిని దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి, అత్యాచారం చేశాడు. అనంతరం, ఆమెను ఆమె ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడు.

పోలీసులకు ఫిర్యాదు

బాధిత యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్తాఫ్ తనకు బలవంతంగా డ్రింక్ తాగించాడని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అల్తాఫ్, కార్డోజా ఇద్దరినీ అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. బాధితురాలు తన వాంగ్మూలాన్ని రికార్డు చేసి మేజిస్ట్రేట్ కు సమర్పించనుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మణిపాల్ లోని కస్తూర్బా ఆస్పత్రిలో చేర్పించారు. 138 (అపహరణ), 64 (అత్యాచారం) సహా భారతీయ న్యాయ్ సంహిత లోని సంబంధిత సెక్షన్ల కింద అల్తాఫ్, కార్డోజాలపై కేసు నమోదు చేశారు.