Father killed Daughter: పెద్దైతే కూతురు భారమవుతుందని, కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి చంపిన తండ్రి
Father killed Daughter: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఒక వైపు మేము మగ వారికంటే తాము ఇందులోని తీసిపోమని, అంతరిక్షంలోకి కూడా ఎగరడానికి తయారుగా ఉన్నామని నిరూపంచుకుంటున్నా ఆడ పిల్లలపై వివక్షత కొనసాగుతూనే ఉన్నది. పెరిగి పెద్దైతే, కూతురుని చదివించి, పెళ్లి చేయటం ఆర్ధికంగా భారమవుతుందని కూతుర్ని చంపేశాడు
Father killed Daughter: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఒక వైపు మేము మగ వారికంటే తాము ఇందులోని తీసిపోమని, అంతరిక్షంలోకి కూడా ఎగరడానికి తయారుగా ఉన్నామని నిరూపంచుకుంటుంటే దేశంలో రోజు ఎక్కడో ఒక దగ్గర, ఆడ పిల్లల పైన వివక్షత కొనసాగుతూనే ఉన్నదీ. పెరిగి పెద్దైతే, తన కూతురు ని చదివించడానికి, పెళ్లి చేయటం తనకు ఆర్ధికంగా భారంగా మారుతుందని, కన్న తండ్రే కూతురుకు కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి త్రాగించి చంపినా సంఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది.
రెండు నెలలక్రితం జరిగిన సంఘటన…
ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శేరీల గ్రామంలో రెండు నెలల క్రితం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శేరీల గ్రామానికి చెందిన దంపతులు ఇక్కిరి సౌందర్య, శ్రీశైలంకు నిఖిత అనే ఎనిమిది సంవత్సరాల కూతురుతో పాటు మరొక బాబు ఉన్నాడు.
రోజు ఆడుతుపాడుతూ బడికి వెళ్లి వచ్చే నిఖిత, ఈ సంవత్సరం మే 31 రోజు తీవ్ర హఠాత్తుగా తీవ్ర అస్వస్థకు గురయ్యింది. పనికి వెళ్ళి ఇంటికి వచ్చిన సౌందర్య, కూతురు పరిస్థితి చూసి వెంటనే తనను దగ్గర్లోని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ నిఖితను పరిశీలించిన డాక్టర్లు, తనను వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించాలని, తన పరిస్థితి చాల సీరియస్ ఉన్నదని చెప్పటంతో విస్తుపోవటం తల్లి వంతయ్యింది.
ఆ రోజు వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న నిఖిత, ఒక్కసారిగా ఎలా అంత అనారోగ్యానికి గురయ్యిందనేది తల్లికి కి అర్ధం కాలేదు. డాక్టర్ల సూచనతో, తనను వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులు చికిత్స అందించిన డాక్టర్లు, ఎంత ప్రయత్నం చేసిన నిఖిత ప్రాణం కాపాడలేకపోయారు. అయితే తనపైన విష ప్రయోగం జరిగందని డాక్టర్లు తెలపటంతో, అది ఎవరు చేసారు అనేది సౌందర్యకు అర్ధంకాలేదు.
కూతురు చనిపోయిన బాధ తండ్రిలో కనపడకపోవడంతో .
శ్రీశైలం లో కూతురు చనిపోయిన బాధ ఏ మూల కనిపించకపోవడంతో, సౌందర్యకు అనుమానం బలపడింది. కొద్దిరోజులు తనను దగ్గరగా గమనించిన సౌందర్య, తన సోదరుల సహాయంతో వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూర్తి విచారణ చేసిన వెల్దుర్తి పోలీసులు శ్రీశైలం ను అదుపులోకి తీసుకొని గట్టిగా అడగటంతో, తానే తన కూతురుని చంపినట్టు ఒప్పుకున్నాడు. కూల్ డ్రింక్ లో, ఎలుకల మందు కలిపి కూతురుకి తాపించినట్టు శ్రీశైలం పోలీస్ విచారణలో ఒప్పుకున్నాడు. తనను అదుపులోకి తీసుకొని కోర్ట్ లో ప్రవేశపెట్టారు. నిందితుడికి జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.
ఆడపిల్లల పై వివక్ష చూపొద్దు....
కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ రంగా కృష్ణ మాట్లాడుతూ అమ్మాయిల పైన వివక్ష చూపితే తాము తల్లితండ్రుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారిని చదివిస్తే, తమ కాళ్ళ పైన తాము నిలబడటంతో పాటు, నలుగురికి దారి చూపించగలుగుతారని అయన అన్నారు. ఇలాంటివి గ్రామాల్లో ఎవరు గమనించిన, తమ దృష్టికి తీసుకరావాలని, తాము ముందే తల్లితండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని రంగా కృష్ణ అన్నారు. నిఖితను తన కన్న తండ్రే చంపాడు అని తెలియడంతో, గ్రామం మొత్తం షాక్ గురయ్యింది.