Nobel prize : కొవిడ్ టీకా కోసం నిరంతర కృషి చేసిన ఇద్దరికి నోబెల్ బహుమతి!
Nobel prize : వైద్య రంగానికి గాను ఈ ఏడాది.. కాటలిన్ కరికో, డ్రూ వైస్మెన్లను నోబెల్ బహుమతి వరించింది. కొవిడ్ మహమ్మారికి టీకా కనుగొనడంలో వీరిది కీలక పాత్ర!
2023 Nobel prize for medicine : కొవిడ్-19పై అంతులేని పోరాటం చేసి, టీకా వృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు 2023 నోబెల్ బహుమతి వరించింది. వైద్య రంగానికి సంబంధించిన ఈ విభాగంలో.. కాటలిన్ కారికో, డ్రూ వైస్మెన్లకు నోబెల్ అవార్డు దక్కింది. ఈ మేరకు నోబెల్ బహుమతి అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ ప్రకటన వెలువడింది.
కరోనా సమయంలో.. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లను వీరిద్దరు కనుగొన్నారు. దీని వల్లే.. కొవిడ్-19పై పోరాటానికి కీలకమైన, సమర్థవంతమైన ఫైజర్ వంటి వ్యాక్సిన్లను ప్రపంచం పొందగలిగింది.
Katalin Kariko Nobel prize : "ఫిజియాలాజీ/ వైద్య రంగంలో 2023 నోబెల్ ప్రైజ్‌ను కాటలిన్ కారికో, డ్రూ వైస్మెన్లకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. కొవిడ్ టీకా తయారీలో వారి పాత్రకు ఈ అవార్డు ఇస్తున్నాము," అని స్వీడెన్లోని నోబెల్ అసెంబ్లీ పేర్కొంది.
వైద్య రంగంలో అత్యున్నత పురస్కారంగా దీనిని పరిగణిస్తారు. బహుమతితో పాటు ఈసారి విజేతలకు 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్ (1 మిలియన్ డాలర్) నగదు కూడా లభిస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీలో అది సుమారు రూ. 8.3కోట్లు.
నోబెల్ సీజన్ షురూ..!
Drew Weissman Nobel Prize : ఈ నోబెల్ అవార్డులను 1901 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వీడెన్కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వీటిని ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ అవార్డులను కొనసాగిస్తున్నారు.
వైద్యం, శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక విభాగాల్లో నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. ఈసారి వైద్య రంగంతో ఈ ఈవెంట్ మొదలైంది. రానున్న రోజుల్లో ఇతర బహుమతులను ప్రకటిస్తారు.
స్టాక్‌హోంలో ఈ ఏడాది డిసెంబర్ 10న జరగనున్న ఈవెంట్లో.. స్వీడెన్ రాజు చేతుల మీదుగా. విజేతలు బహుమతులను, నగదును అందుకుంటారు.
సంబంధిత కథనం