America Covid : అమెరికాలో కొవిడ్ తరహా మహమ్మారి.. అప్రమత్తంగా లేకపోతే అంతే!
Covid-style pandemic in America : అమెరికాలో కొవిడ్ తరహా మహమ్మారి ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధంచిన ఓ నివేదిక ఇప్పుడు ప్రజలను భయపెడుతోంది.
Covid style pandemic in America : కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పడిప్పుడే కోలుకుంటున్నాయి. కరోనా పేరును ప్రజలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. ఈ సమయంలో అమెరికాకు చెందిన ఓ బృందం పిడుగులాంటి వార్తను బయటపెట్టింది! ప్రపంచాన్ని గడగడలాడించే తదుపరి మహమ్మారి.. అమెరికా నుంచే పుట్టుకొస్తుందని వెల్లడించింది. ఈ విషయాన్ని అక్కడి ప్రజలు నమ్మకపోయినా, అగ్రరాజ్యం కేంద్రబిందువుగానే ప్రమాదం ముంచుకొస్తుందని అంచనా వేశారు.
‘జాగ్రత్తగా లేకపోతే.. అంతే!’
"అమెరికాలో నిబంధనలను సరిగ్గా పాటించడం లేదు. ఈ పరిణామాలతో జంతువుల నుంచి ప్రమాదకరమైన వైరస్ మనిషికి పాకే ప్రమాదం ఉంది," అని హార్వర్డ్ లా స్కూల్, న్యూయార్క్ వర్సిటీ నివేదిక వెల్లడించింది.
"అమెరికాలో మహమ్మారులు పుట్టుకురావని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఇక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదు. నిజం చెప్పాలంటే.. ఇతర దేశాల కన్నా మనమే బలహీనంగా ఉన్నాము. కమర్షియల్ ఫార్మింగ్నే చూడండి. అక్కడ అనేక జంతువులతో మనుషులు కాంటాక్ట్‌లోకి వస్తారు. కానీ అక్కడ నిబంధనలను సరిగ్గా పాటించడం లేదు. అటవీ జంతువుల ట్రేడ్‌లో కూడా ఇంతే. ఆరోగ్యపరమైన నిబంధనలు పాటించట్లేదు. వివిధ ఖండాల్లో జంతువులను, పాథోజెన్స్ని ఇష్టానుశారంగా కలిపేస్తున్నాము," అని రిపోర్టు లీడ్ ఆథర్ ఆన్ లిండర్ తెలిపారు.
ఇదీ చూడండి:- అవును చైనాలోనే కొవిడ్-19 తయారీ.. పరిశోధకుడు షాకింగ్ కామెంట్స్
America Covid news : "అమెరికాలో ప్రతియేటా 220 మిలియన్‌కుపైగా జంతువులు దిగుమతి అవుతుంటాయి. కుక్కలను తెచ్చుకునేందుకు రూల్స్ ఉన్నాయి. కానీ అటవీ జంతువులను దిగుమతి చేస్తుంటే సరైన రెగ్యులేషన్ లేదు," అని లిండర్ అభిప్రాయపడ్డారు.
పంది, పౌల్ట్రీ ఫామ్‌లలో పనిచేసే వర్కర్లు కొత్త మహమ్మారికి గురయ్యే ప్రమాదం ఉంటుందని నివేదిక పేర్కొంది. కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయాన్ని చూసిన తర్వాత కూడా సరైన రెగ్యులేషన్లు లేకపోవడం బాధాకరం అని యానిమల్ లా అండ్ పాలిసీ ఇన్స్టిట్యూట్ డైరక్టర్ డాల్సియానా విండర్స్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం