Jio Offer | జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.333 ప్లాన్ తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ
టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ప్లాన్ తోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మెంబర్ షిప్ ఉచితంగా అందజేస్తోంది.
మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. టెలికాం దిగ్గజం జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అదనపు ప్రయోజనంతో ఎంజాయ్ చేయోచ్చు. కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ .333 నుంచి ప్రారంభమవుతాయి. అయితే మూడు నెల సబ్ స్క్రిప్షన్ దొరుకుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం ద్వారా ఎంపిక చేసిన రీఛార్జ్‌లపై ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితంగా ఎంజాయ్ చేయోచ్చు. మూడు నెలలపాటు సబ్ స్క్రిప్షన్ ని జియో అందిస్తుంది. కస్టమర్లు కావాల్సిన ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ ప్లాన్ ప్రకారం.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లాంటి ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారని జియో ప్రకటించింది.
రీఛార్జ్ చేసిన తర్వాత సంబంధిత Jio మొబైల్ నంబర్‌తో Disney+ Hotstar యాప్‌కి సైన్ ఇన్ చేయండి. సైన్-ఇన్ ప్రక్రియను పూర్తి చేయడానికి జియో నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయాలి. లాగిన్ తర్వాత మీ కొత్త 3 నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో లైవ్ క్రికెట్‌తో సహా మీకు ఇష్టమైన కంటెంట్‌ను చూడొచ్చు.
జీయో ప్రకటించిన రీఛార్జ్ ప్లాన్స్.. రూ. 151, రూ.333, రూ.583, రూ.783గా ఉన్నాయి. ఈ అన్ని ప్లాన్స్ కు మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
టాపిక్