Japan earthquake today : భారీ భూకంపంతో జపాన్ను ఢీకొట్టిన ‘సునామీ’!
Japan earthquake today : జపాన్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూప్రకంపనల కారణంగా సునామీ.. తీర ప్రాంతాలను ఢీకొట్టింది.
Japan earthquake today : నూతన ఏడాది తొలి రోజున జపాన్లో భుకంపం గడగడలాడించింది. జపాన్లోని నార్త్ సెంట్రల్ ప్రాంతంలో సోమవారం నాడు 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్థి నష్టం జరిగింది? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కాగా.. తాజా భూకంపం కారణంగా.. ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భారీ అలలు ఇప్పటికే కొన్ని తీర ప్రాంతాలను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
సునామీ అలర్ట్ జారీ..
జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా, నైగట, టయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. అదే ఇషికావాలోని వజిమా నగరంలో 1 మీటర్ ఎత్తున్న అలలు తీరాన్ని తాకినట్టు సమాచారం.
Japan Tsunami alert : ఇక నైగట రాష్ట్రంలోని కషిజావకి నగరంలో 40 సెంటీమీటర్ల ఎత్తుతో అలలు తీరంవైపు దూసుకొచ్చినట్టు అక్కడి మీడియా పేర్కొంది.
స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటల 35 నిమిషాల ప్రాంతంలో.. 80 సెంటీమీటర్ల ఎత్తున్న అలలు.. టయోమా రాష్ట్ర తీర ప్రాంతాన్ని ఢీకొట్టినట్టు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. యమగట, హ్యోగో ప్రాంతాలవైపు అలలు దూసుకెళుతున్నట్టు వివరించింది.
భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న హొకురికి ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా? అన్నది చెక్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
Japan earthquake live updates : మరోవైపు.. జపాన్లో భూకంపం, సునామీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సునామీ ముప్ప ప్రాంతాల్లోని ప్రజలను వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా.. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఇక జపాన్లో సంభవించిన భారీ భూకంపంతో భవనాలు, మెట్రో రైళ్లు దారుణంగా షేక్ అయ్యాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సంబంధిత కథనం